అమెరికాలో రూ.85 వేల ట్యాబ్లెట్.. ఇండియాలో కేవలం 35 రూపాయలకే.. యూఎస్ మహిళ వీడియో వైరల్

అమెరికాలో రూ.85 వేల ట్యాబ్లెట్.. ఇండియాలో కేవలం 35 రూపాయలకే.. యూఎస్ మహిళ వీడియో వైరల్

హెల్త్ కేర్ కాస్ట్ (ఆరోగ్యానికి అయ్యే ఖర్చు) విషయంలో అమెరికాకు ఇండియాకు మధ్య ఎంత తేడా ఉందో ఒక యూఎస్ మహిళ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఇన్ స్టాలో Indian vs American healthcare అనే టైటిల్ తో చేసిన పోస్ట్ అతి తక్కువ టైంలోనే 8 మిలియన్ల రీచ్ రావడంతో వైరల్ అయిపోయింది. 

లిజ్ అనే మహిళ చేసిన వీడియోలో.. అమెరికాలో ఘోరంగా దోచుకుంటున్నారని ఆరోపించింది. ఆమె ఆంట్ మెడికల్ కండిషన్ బాలేదని.. మెడిసిన్ వాడుతున్న క్రమంలో.. యూఎస్ లో ఒక పిల్ 900 డాలర్లు (రూ.35 వేలు) విలువైన పిల్.. ఇండియాలో 35 రూపాయలకే వస్తుందని.. మమ్మల్ని ఇక్కడ దారుణంగా బాగా దోచుకుంటున్నారని వీడియోలో పేర్కొంది. 

ప్రపంచ దేశాలతో పోల్చితే ఇండియాలో మెడిసిన్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు. తమ ఆంట్ కు బ్లడ్ క్యాన్సర్ ఉందని.. దాని నివారణకు కావాల్సిన రెవిలిమిడ్ (Revlimid) మాత్రలు వాడుతున్నారని తెలిపారు. 

అమెరికాలో ఒక పిల్ కాస్ట్ 900 డాలర్లు అంటే 85 వేల రూపాయలు. అదే సమయంలో ఇండియాలో 35 నుంచి 300 రూపాయలలోపే ఉండటం చూసీ షాకయ్యాం అని వీడియోలో పేర్కొంది. 

►ALSO READ | ఈ కేరళ నర్సులకు కాళ్లు మొక్కచ్చు : నడి రోడ్డుపై వ్యక్తికి గుండెపోటు.. బస్సు నుంచి దూకి మరీ ప్రాణాలు కాపాడారు..!

ఇండియాలో ప్రజలకు చాలా తక్కువ ధరలో.. భరించగలిగే స్థాయిలోనే మెడిసిన్ అందుతోందని.. అదే సమయంలో యూఎస్ లో భారీగా దోచుకుంటున్నారని విమర్శించింది. 

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోకు కామెంట్స్ మోత మోగుతున్నాయి. ఇది నిజంగా దురదృష్టకరం.. కానీ నిజం. ప్రజల కోసం రెగ్యులేటర్స్ సరైన నిర్ణయం తీసుకోవాలని ఒక వ్యూవర్ కామెంట్ చేశఆడు. 

ఒక్క ట్యాబ్లెట్ కు 900 డాలర్లా.. సిగ్గుపడాలి ఇది చూసైనా..ఇండియాకు వెళ్లిన ప్రతీసారి నేను కావాల్సిన మెడిసిన్ తెచ్చుకుంటానని మరో యూజర్ పర్కొన్నారు. 

మెడిసిన్ అవసరమయ్యేూ ప్రతి అమెరికా పౌరుడు ఇక నుంచి ఇండియా ఫ్లైట్ బుక్ చేసుకోవడం మంచిది అంటూ మరో నెటిజన్ పంచ్ వేశాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Liz & Shiv (@spicygori)