హైదరాబాద్: దృష్టి మళ్లించి చోరీలకు పాల్పడుతున్న ఆర్గనైజ్డ్ అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ ను లంగర్ హౌజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ ను టార్గెట్ చేసి 13.5 తులాల బంగారం చోరీ చేసిన ఆరుగురు ముఠా సభ్యులను లక్డీకాపూల్ లోని షాఘోస్ హోటల్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితులనుంచి 13.5 తులాల బంగారం, 7.4 లక్షల నగదు ను స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్తులే ఓ ముఠాగా ఏర్పడి వృద్దులు, మహిళలను టార్గెట్ చేసి చోరీలు చేస్తున్నట్లు గుర్తించారు.
ఇటీవల షా ఘౌస్ హోటల్ సమీపంలో రిటైర్డ్ SBI బ్యాంకు మేనేజర్ దృష్టి మళ్లించి చోరీ చేశారు నిందితులు. బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. టోలీ చౌకి ACP సయ్యద్ ఫయాజ్ ఆధ్వర్యంలో ఈ కేసు ను ట్రేస్ ఔట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీ, ఇన్ ఫార్మర్ల సహకారంతో ముఠా గుట్టు రట్టు చేశారు. చోరీ చేసిన బంగారం, నగదుతోపాటు ఆటో, బైక్, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
