టీచర్లకు వీడియో పాఠాల ట్రైనింగ్..పీఎం ఈ-విద్యా డీటీహెచ్ చానళ్ల కోసం నాణ్యమైన కంటెంట్ తయారీ 

టీచర్లకు వీడియో పాఠాల ట్రైనింగ్..పీఎం ఈ-విద్యా డీటీహెచ్ చానళ్ల కోసం నాణ్యమైన కంటెంట్ తయారీ 

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ పీఎం ఈ–విద్యా డీటీహెచ్ టీవీ చానళ్ల ద్వారా ప్రసారమయ్యే వీడియో పాఠాల రూపకల్పన కోసం టీచర్లకు ప్రత్యేక సామర్థ్య పెంపుదల శిక్షణ ఇవ్వనుంది. ఈ నెల 6 నుంచి 9వరకు నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని టీ శాట్ కేంద్రంలో ఈ వర్క్‌‌‌‌‌‌‌‌షాప్ జరగనుంది. జిల్లాల వారీగా ఒకటి నుంచి పదో తరగతి వరకూ బోధించే ప్రతి సబ్జెక్ట్ కవర్ అయ్యేలా టీచర్లను ఎంపిక చేయాలని తాజాగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ డీఈఓలకు ఆదేశాలిచ్చింది.

క్లాసులు,  సబ్జెక్టుల వారీగా ఒక్కో టీచర్‌‌‌‌‌‌‌‌ను నామినేట్ చేయాల్సి ఉంటుంది. వీడియో పాఠాల రూపకల్పన, కంటెంట్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో గతంలో అనుభవం ఉన్నవారికి, డిజిటల్ కంటెంట్‌‌‌‌‌‌‌‌పై ఆసక్తి ఉన్న టీచర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఎంపిక చేసిన టీచర్ల వివరాలను నిర్ణీత ప్రొఫార్మాలో నింపి ఈ నెల 5వ తేదీ లోగా [email protected] మెయిల్‌‌‌‌‌‌‌‌కు పంపాలని సూచించింది.

కేంద్ర విద్యాశాఖ పరిధిలోని సీఐఈటీ, ఎన్సీఈఆర్టీ సహకారంతో సాఫ్ట్‌‌‌‌‌‌‌‌నెట్ (టీశాట్) నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. డిజిటల్ విద్యా కంటెంట్‌‌‌‌‌‌‌‌ను నాణ్యంగా రూపొందించడం, ఎడ్యుకేషనల్ బ్రాడ్‌‌‌‌‌‌‌‌కాస్టింగ్ మెలకువలు, డిజిటల్ డెలివరీ, విద్యార్థులను ఆకట్టుకునేలా వీడియో పాఠాలను ఎలా రూపొందించాలనే అంశాలపై టీచర్లకు ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వనున్నారు.