మేడ్చల్‌‌‌‌లో అగ్నిప్రమాదం.. రెండు ఫర్నిచర్ షాపులు దగ్ధం

మేడ్చల్‌‌‌‌లో అగ్నిప్రమాదం.. రెండు ఫర్నిచర్ షాపులు దగ్ధం

మేడ్చల్, వెలుగు: మేడ్చల్ చెక్‌‌‌‌పోస్టు వద్ద ఉన్న రెండు ఫర్నిచర్ షాపుల్లో శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో షాపుల్లోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. మంటలు తీవ్రంగా ఎగసిపడి పక్కనే ఉన్న మరికొన్ని షాపులకు కూడా వ్యాపించాయి. దీంతో పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది.

స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎవరో గిట్టని వ్యక్తులు కావాలనే అగ్నిప్రమాదానికి పాల్పడి ఉంటారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.