కోల్‌కతా: కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో జరిగిన చారిత్రక ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భారత్ బ్రెజిల్‌తో 0–4తో ఓడినా మంచి ఆటతీరు కనబర్చిందని బ్రెజిల్ కోచ్ కార్లో ప్రశంసించారు. తొలి 25 నిమిషాలు బ్రెజిల్‌కు గట్టి పోటీ ఇచ్చిందన్నారు. భారత ఆటగాళ్లు క్రమశిక్షణతో వ్యవహరించడంతో పాటు కౌంటర్ అటాక్స్‌కు ప్రయత్నించారని చెప్పారు.
‘‘వాళ్లు తమ ఆట ఆడారు. డిఫెండ్ చేశారు, ఆర్గనైజ్డ్‌గా ఉన్నారు. కౌంటర్ అటాక్‌కు ప్రయత్నించారు. భారత్ మంచి ఆట ఆడింది’’ అని పేర్కొన్నారు. తొలి గోల్ వచ్చే వరకు బ్రెజిల్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయని, ఆ తర్వాత మ్యాచ్‌పై పట్టు సాధించామని తెలిపారు.
