కొత్తవారం బంగారం ధరలు తిరిగి దూకుడుగా ముందుకు సాగటం స్టార్ట్ చేశాయి. ఈ నెల ప్రారంభంలో కొంత తగ్గిన రేట్లు ఆ తర్వాత బ్రేక్ లేకుండా దూసుకుపోవటంతో తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. శ్రావణమాసంలో శుభకార్యాలకు షాపింగ్ చేయాలనుకునేవారికి ఇది ఆటంకంగా మారింది. రేట్లు తగ్గితే కొందాం అని చాలా మంది వేచిచూస్తున్నప్పటికీ ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే రేట్లు పెద్దగా తగ్గేలా కనిపించటం లేదని నిపుణులు అంటున్నారు.
ఆగస్టు 17న బంగారం రేట్లు పెరిగాయి. ఆగస్టు 16 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.53 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 566గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 270గా కొనసాగుతోంది.
ALSO READ : మనిషిని ఉద్యోగంలోంచి తీసేసిన ఏఐ మేనేజర్
సోమవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఆగస్టు 17, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 55వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.255 దగ్గర అమ్మకాలు జరుగుతున్నాయి.
