పాల్వంచ, వెలుగు: సైబర్ క్రైమ్‌పై పాల్వంచ రూరల్ పీఎస్ పరిధిలో ఆదివారం కేసు నమోదయ్యింది. ఎస్సై సురేశ్తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సూరారానికి చెందిన ధనసరి ప్రశాంత్ మధ్యప్రదేశ్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల కాచిగూడ నుంచి ట్రైన్ లో మధ్యప్రదేశ్ వెళ్తుండగా మధ్యలో మొబైల్ మిస్సయింది.
దీంతో ఆయన తర్వాత రోజు మరో మొబైల్ కొనుగోలు చేశాడు. అయితే తన మొబైల్ లోని బ్యాంకు అకౌంట్నుంచి సుమారు రూ.27వేలు మాయమైనట్లు గుర్తించి ఆన్లైన్ లో సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్వంచ రూరల్ పీఎస్‌కు కేసును బదిలీ చేశారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
