బయ్యారంలో నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం.. రూ.58 కోట్లకు పైగా దోపిడి

బయ్యారంలో నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం.. రూ.58 కోట్లకు పైగా దోపిడి

 మహబూబాబాద్ జిల్లాలో భారీ దోపిడి వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 58 కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడ్డారు. బయ్యారం మండలంలోనే జరిగిన ఈ ఫేక్ సర్టిఫికెట్ల దోపిడీ బాగోతం అధికారులను షాకింగ్ కు గురిచేస్తోంది. 

బయ్యారం మండలంలో మూడు గ్రామ పంచాయతీల డిజిటల్ మిస్సింగ్ లో భారీ కుంభకోణం జరిగింది. జనన, మరణ నకిలీ ధృవీకరణ పత్రాలతో భారీ అక్రమాలకు తెరలేపారు కొందరు అధికారులు.  నామలపాడు - 159, ఇర్సులాపురం - 96, కొత్తగూడెం - 9 , మొత్తం 264 నకిలీ సర్టిఫికెట్లు జారీ చేశారు. 

విచారణలో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ప్రధాన సూత్రధారిగా మీ సేవ కేంద్రం నిర్వాహకుడు  (ఐ.డి - RFMH013) ని గుర్తించారు. నకిలీ ధృవీకరణ పత్రాలతో ఇతర రాష్ట్రాలల్లో ఇన్యురెన్స్ డబ్బులు తీసుకున్నారు. ఈ కుంభకోణంపై విచారణ కొనసాగుతోంది.