ఫుడ్ పాయిజన్ తో స్టూడెంట్లకు అస్వస్థత..ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఘటన

ఫుడ్  పాయిజన్  తో స్టూడెంట్లకు అస్వస్థత..ఖమ్మం జిల్లా  పెనుబల్లి మండలంలో ఘటన
  •  ఉప్పలచిలక యూపీఎస్ లో ఘటన

పెనుబల్లి, వెలుగు : ఫుడ్ పాయిజన్ తో ఆరుగురు స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఉప్పలచిలక యూపీఎస్ లో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... స్కూల్ లో స్టూడెంట్లకు ఉదయం పల్లి చట్నీతో ఉప్మా, మధ్యాహ్నం 12 గంటలకు అన్నం, సాంబార్, పెట్టారు. 

కొద్దిసేపటి తర్వాత స్రవంతిక, మనోజ్ కుమార్, నవీన్, శివ కేశవ, లక్ష్మీనారాయణ, ఉదయశ్రీ అనే స్టూడెంట్లు వాంతులు, కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన టీచర్లు ఆటోలో పెనుబల్లి ఏరియా హాస్పిటల్ కు తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. స్టూడెంట్ల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని లంక సాగర్ పీహెచ్ సీ మెడికల్ ఆఫీసర్ కిరణ్ తెలిపారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎంఈఓ మోహన్ రావు విచారణ చేపట్టారు.