భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. 98 రోజులకు సంబంధించిన హుండీలు లెక్కించగా రూ.2,12,40,214 ఆదాయం వచ్చింది.
ఇంకా170 గ్రాములు మిశ్రమ బంగారం, కిలో 400 గ్రాముల మిశ్రమ వెండి వచ్చాయి. వీటితో పాటు విదేశీ కరెన్సీ భారీగా సమకూరినట్లు ఈవో దామోదర్‌రావు తెలిపారు. లెక్కింపు అనంతరం నగదును బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా మిథిలా ప్రాంగణంలో మధ్యాహ్నం నుంచి లెక్కింపు చేపట్టారు.
