హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా మహేష్ భగవత్ బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా మహేష్ భగవత్ బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు మహేష్ భగవత్. 2026, నవంబర్ 13వ తేదీ మధ్యాహ్నం పోలీస్ కమిషనరేట్ లోని తన ఛాంబర్ లో సంతకాలు చేశారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న సజ్జనార్.. మహేష్ భగవత్ కు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. బదిలీ ఉత్వర్వులు వచ్చిన 12 గంటల్లోనే.. మహేష్ భగవత్ తన బాధ్యతలు స్వీకరించారు. 

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. మీడియాతో మాట్లాడారు కొత్త పోలీస్ బాస్. సైబర్ నేరాల నియంత్రణ, డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని.. ఈ విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తామని నేరగాళ్లకు వార్నింగ్ ఇచ్చారు సీపీ మహేష్ భగవత్. 

హైదరాబాద్ సిటీలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఉంటుందని.. ఈ విషయంలో రాజీ పడేది లేదని.. మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించే వాళ్లపై కఠిన చట్టాలు ఉపయోగించి శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు మహేష్ భగవత్. ఇదే సమయంలో హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ సమస్య ఉందని.. ఇప్పటికే అనేక విధానాలు అమలు చేయటం ద్వారా వాహనదారులకు ట్రాఫిక్ చిక్కుల నుంచి పరిష్కారం చూపిస్తున్నామని.. రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా ట్రాఫిక్ నిర్వహణ ఉంటుందని భరోసా ఇచ్చారు హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్. తరచు నేరాలకు పాల్పడుతున్న నేరగాళ్లపై నిరంతరం నిఘా ఉంటుందని.. నేరగాళ్లపై పీడీ యాక్ట్ అమలు చేసి.. నేరాలను కంట్రోల్ చేస్తామని హామీ ఇచ్చారు పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్. 

పెండింగ్ కేసుల పరిష్కారంతోపాటు పోలీసుల్లో జవాబుదారీతనం అనేది చాలా ముఖ్యం అని.. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం, మెరుగైన సేవలు అందిస్తామని భరోసా ఇచ్చారు సీపీ మహేష్ భగవత్. హైదరాబాద్ సిటీ అందరిదీ అని.. హైదరాబాద్ సిటీకి మంచి పేరు, గుర్తింపు తీసుకొచ్చే విషయంలో రాజీ లేదని.. శాంతి భద్రతల విషయంలో సిటీ జనానికి పోలీసులు భరోసా కల్పిస్తారని.. శాంతి భద్రతలకే అధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు హైదరాబాద్ సిటీ కొత్త పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్.