రోహిత్ 0, కోహ్లీ 0, శ్రేయస్ 0.. తొలి ఓవర్‌లోనే 3 డకౌట్లు.. పీకల్లోతు కష్టాల్లో భారత్

రోహిత్ 0, కోహ్లీ 0, శ్రేయస్ 0.. తొలి ఓవర్‌లోనే 3 డకౌట్లు.. పీకల్లోతు కష్టాల్లో భారత్

అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలోనే టీమిండియా అత్యంత భయానకమైన ఆరంభాన్ని చూసింది. మౌంట్ మౌంగనుయ్ వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో 334 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, తొలి ఓవర్ ముగిసేసరికి ఒక్క పరుగు కూడా చేయకుండానే కీలకమైన మూడు వికెట్లు (0/3) కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. న్యూజిలాండ్ స్టార్ పేసర్ మ్యాట్ హెన్రీ (Matt Henry) వేసిన తొలి ఓవర్ ఇండియన్ టీమ్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చింది.

తొలి ఓవర్లోనే ట్రిపుల్ షాక్.. అసలేం జరిగిందంటే: 

* తొలి బంతికే రోహిత్ గోల్డెన్ అవుట్ (0.1): ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన మ్యాట్ హెన్రీ తన తొలి  బంతికే స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (0) గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. 

* కోహ్లీ కూడా డకౌట్: క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (0) 4 బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే హెన్రీ బౌలింగ్‌లో వికెట్ సమర్పించుకున్నాడు.

* కెప్టెన్ అయ్యర్ గోల్డెన్ డక్: ఆ వెంటనే బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (0) కూడా ఎదుర్కొన్న తొలి బంతికే అవుటవడంతో, మ్యాట్ హెన్రీ తొలి ఓవర్‌ను వికెట్ మెయిడిన్‌గా (3 వికెట్లు, 0 పరుగులు) ముగించాడు.

ప్రస్తుత మ్యాచ్ అప్ డేట్: 

* భారత్ స్కోర్: 7.1 ఓవర్లలో 13 పరుగులకే కీలకమైన 4 వికెట్లని నష్టపోయింది. 

* తొలి ఓవర్ ముగిసేసరికి స్కోర్ బోర్డుపై 0/3 నమోదు కావడం భారత అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దిగ్గజ బ్యాటర్లంతా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడంతో, ఈ సిరీస్‌లో తొలిసారి తుది జట్టులోకి వచ్చిన యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు, కేవలం 5 పరుగులు చేసిన తర్వాత కైల్ జేమిసన్ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో ప్రస్తుతం క్రీజులో ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ పై ఇప్పుడు జట్టు భారం మొత్తం పడింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వీరిద్దరూ క్రీజులో నిలదొక్కుకుని జట్టును ఆదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.