ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు ఫ్యామిలీ, ఫ్యాషన్, సోషల్ మీడియా వేదికలపై తనదైన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఇప్పుడు భారతీయ కళలు, సంస్కృతి, చారిత్రక వారసత్వ పరిరక్షణలోనూ భాగస్వామి కాబోతున్నారు. భారతదేశంలోనే తొలి స్టెప్‌వెల్ ఆర్ట్ బినాలేగా ప్రచారం పొందుతున్న ‘బావోలి ఆర్ట్ సంగం’కు ఫౌండింగ్ ఛైర్‌పర్సన్ – కల్చర్ అండ్ హెరిటేజ్‌గా అల్లు స్నేహారెడ్డి నియమితులయ్యారు. చరిత్రకు ప్రతీకలుగా నిలిచిన పురాతన మెట్ల బావులను కళా వేదికలుగా తీర్చిదిద్దుతూ, మన సంస్కృతిని భావితరాలకు పరిచయం చేయాలనే ఈ వినూత్న ప్రయత్నంలో ఆమె కీలక పాత్ర పోషించనున్నారు. కాగా త్వరలోనే తెలంగాణాలో ‘బావోలి ఆర్ట్ సంగం’ ఏర్పాటుకానుంది.
బావోలి ఆర్ట్ సంగం అంటే ఏమిటి?
చారిత్రక మెట్ల బావులకు పునర్వైభవం తీసుకొస్తూ, కళలు, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడమే లక్ష్యంగా ‘బావోలి ఆర్ట్ సంగం’ (Baoli Art Sangam)ను రూపొందించారు. భారతదేశంలోనే తొలి స్టెప్‌వెల్ ఆర్ట్ బినాలేగా దీన్ని పరిచయం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని గోల్కొండ, బన్సీలాల్‌పేట, ఫలక్‌నుమా, రాష్ట్రపతి నిలయం తదితర చారిత్రక ప్రదేశాల్లో కళా ప్రదర్శనలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 1, 2026 నుంచి జనవరి 10, 2027 వరకు జరిగే ఈ వేడుకల్లో 13కి పైగా ప్రదేశాల్లో 200 మందికి పైగా కళాకారులు సంగీతం, నృత్యం, చిత్రకళ వంటి కళారూపాలను ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా పురాతన మెట్ల బావుల ప్రాముఖ్యతను నేటి తరానికి తెలియజేయడం, నీటి సంరక్షణపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.
ఎవరీ అల్లు స్నేహ రెడ్డి:
అల్లు స్నేహారెడ్డి అంటే చాలామందికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణిగానే తెలుసు. అయితే ఆమెకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉన్నత విద్యను అభ్యసించిన స్నేహారెడ్డి.. ఫోటోగ్రఫీ, ఫ్యాషన్, కళలపై ఆసక్తితో 2016లో ‘పికా-బూ’ (Pic-a-boo) ఫోటోగ్రఫీ సంస్థను ప్రారంభించారు. విద్యా, వ్యాపార రంగాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఇప్పటివరకు కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత అభిరుచులతో వార్తల్లో నిలిచిన ఆమె.. ఇప్పుడు బావోలి ఆర్ట్ సంగం ఫౌండింగ్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టడం ద్వారా కళలు, సంస్కృతి, వారసత్వ పరిరక్షణ రంగంలోకి మరో కీలక అడుగు వేస్తున్నారు.
కొత్త బాధ్యతతో మరో గుర్తింపు!
ఇప్పటివరకు అల్లు అర్జున్ సినీ విజయాలతో పాటు ఆయన కుటుంబానికి సంబంధించిన వార్తల్లోనూ తరచూ కనిపించిన స్నేహారెడ్డి.. ఇప్పుడు కళలు, సంస్కృతి, వారసత్వ పరిరక్షణ వంటి సామాజిక ప్రాధాన్యత కలిగిన అంశంలో కీలక బాధ్యత చేపట్టడం విశేషం. బావోలి ఆర్ట్ సంగం ద్వారా పురాతన మెట్ల బావుల ప్రాముఖ్యతను యువతకు పరిచయం చేయడంతో పాటు, భారతీయ కళా వారసత్వాన్ని మరింత మందికి చేరువ చేసే ప్రయత్నంలో ఆమె భాగస్వామి కానున్నారు.
మొత్తానికి అల్లు అర్జున్ సినీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుంటే.. స్నేహారెడ్డి మరోవైపు కళలు, సంస్కృతి, వారసత్వ పరిరక్షణ దిశగా కొత్త అడుగులు వేస్తున్నారు. ఈ కొత్త బాధ్యతను ఆమె ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తారో, బావోలి ఆర్ట్ సంగం ద్వారా హైదరాబాద్ చారిత్రక సంపదకు ఎలాంటి గుర్తింపు తీసుకొస్తారో చూడాలి!
అల్లు అర్జున్–స్నేహారెడ్డి బాండింగ్:
టాలీవుడ్‌లో అభిమానులు ఇష్టపడే జంటల్లో అల్లు అర్జున్–స్నేహారెడ్డి ఒకరు. అమెరికాలో స్నేహితుడి పెళ్లిలో పరిచయమైన వీరిద్దరూ ప్రేమలో పడి, 2011 మార్చి 6న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి స్నేహారెడ్డి అల్లు అర్జున్‌కు వ్యక్తిగత జీవితంలోనే కాకుండా, ఆయన కెరీర్‌లోనూ అండగా నిలుస్తున్నారు. అలాగే భార్య అభిరుచులకు బన్నీ ప్రోత్సాహం అందిస్తుంటారు. ఈ జంటకు అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబంతో కలిసి గడిపే మధుర క్షణాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటుంటారు.
అల్లు అర్జున్ ‘రాకా’..
‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రాకా’. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ 2028 జనవరి 26న విడుదలయ్యే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అయితే విడుదల తేదీపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
#RAAKA https://t.co/BY1dzQFLY8
— Allu Arjun (@alluarjun) April 8, 2026
