వనస్థలిపురంలో CMR షాపింగ్ మాల్ 45వ బ్రాంచ్‌ ప్రారంభించిన నటి మీనాక్షి చౌదరి

వనస్థలిపురంలో CMR షాపింగ్ మాల్ 45వ బ్రాంచ్‌ ప్రారంభించిన నటి మీనాక్షి చౌదరి

హైదరాబాద్ వనస్థలిపురంలో 45వ సీఎంఆర్ షాపింగ్ మాల్ షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించారు ప్రముఖ హీరోయిన్ మీనాక్షి చౌదరి.  2026 అక్టోబర్ 01వ తేదీన షాపింగ్ మాల్ ప్రారంభించిన మీనాక్షి.. కుటుంబ సమేతంగా షాపింగ్ చేయాలంటే సీఎంఆర్ బెస్ట్ చాయిస్ అని అన్నారు. 

విశాలమైన షోరూమ్‌తో అన్ని వర్గాల వినియోగదారులకు అనువైన షాపింగ్ అనుభూతిని అందించేందుకు సంస్థ కొత్త షోరూమ్ ను ఏర్పాట్లు చేసిందన్నారు. CMR  ఒక లెగసి అని కుటుంబ సమేతంగా షాపింగ్ చేసేందుకు అన్ని రకాల ఫ్యాషన్ వేర్, జ్యువెలరీ, హోమ్ ఎసెన్షియల్స్‌ ఒకే చోట అందుబాటులోకి తీసుకొచ్చారని, మంచి ఆఫీసర్స్ కూడా ఉన్నాయని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో నాలుగు దశాబ్దాలకు పైగా వినియోగదారుల ఆదరణ పొందుతున్న CMR షాపింగ్ మాల్.. ఇప్పుడు హైదరాబాద్‌ వనస్థలిపురంలో తన 45వ షోరూమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.  వినియోగదారులకు అందుబాటు ధరల్లో నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా కొత్త షోరూమ్‌ను తీర్చిదిద్దినట్లు  తెలిపారు.