Jailer 2 Bindaas song: రజనీకాంత్ 'జైలర్ 2'లో నోరా 'బిందాస్'.. తమన్నా 'కావాలా' మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

Jailer 2 Bindaas song: రజనీకాంత్ 'జైలర్ 2'లో నోరా 'బిందాస్'.. తమన్నా 'కావాలా' మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

సూపర్ స్టార్ రజనీకాంత్ ,  దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న  భారీ యాక్షన్ చిత్రం' జైలర్ 2'. ఈ మూవీపై రోజు రోజుకు అంచనాలు రెట్టింపు స్థాయిలో నెలకొన్నాయి. దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 15న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు ఇప్పుడు మరో భారీ హైప్ వచ్చేసింది. 

లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి నాలుగో సింగిల్ 'బిందాస్ 'ను రిలీజ్ చేశారు మేకర్స్ . అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ పాటకు అనిరుధ్, దీప్తి సురేష్ గాత్రం అందించగా.. సూపర్ సుబు సాహిత్యం అందించారు. ముఖ్యంగా ఈ పాటతో బాలీవుడ్ స్టార్ డ్యాన్సర్ నోరా ఫతేహి తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమైంది. గోల్డ్ గ్లామరస్ లుక్, ఎనర్జిటిక్ స్టెప్పులతో నోరా అదరగొట్టడంతో పాట విడుదలైన వెంటనే ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.

గత 'జైలర్'లో తమన్నా భాటియాతో వచ్చిన 'కావాలా' ఏ స్థాయిలో వైరల్ అయిందో తెలిసిందే. ఇప్పుడు దాని సీక్వెల్'జైలర్ 2’లో నోరా ఫతేహి ఉండటంతో ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? అన్న ఆసక్తి నెలకొంది. పైగా అనిరుధ్ మ్యూజిక్ అంటేనే రజనీ ఫ్యాన్స్‌కు ప్రత్యేకమైన కిక్ ను ఇస్తుంది. 

►ALSO READ | వనస్థలిపురంలో CMR షాపింగ్ మాల్ 45వ బ్రాంచ్‌ ప్రారంభించిన నటి మీనాక్షి చౌదరి

ఇక ఈ మూవీలో రజనీకాంత్ మరోసారి రిటైర్డ్ జైలర్ టైగర్ ముత్తువేల్ పాండియన్ గా కనిపించనున్నారు. రమ్యకృష్ణన్, యోగిబాబు వంటి నటులతో పాటు ఎస్.జే. సూర్య, విద్యాబాలన్, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజారమూడు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ కూడా అతిథి పాత్రల్లో మెరవనున్నారు. దసరాకు కానుకగా భారీ తారాగణంతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో చూడాలి మరి..