సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సెవెన్ అవర్స్ టూ గో,ఘోస్ట్, తెలుగులో తగ్గేదే లే' వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటి(27) అనన్య రాజ్ కన్నుమూశారు. అనన్య మరణ వార్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
అనన్య రాజ్ కుటుంబ సభ్యులు ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషాదకర వార్తను ధృవీకరించారు. గత ఏడాది కాలంగా ఆమె తీవ్రమైన శారీరక, మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆమె ఒక యోధురాలిలా పోరాడినప్పటికీ, జూలై 15వ తేదీ తెల్లవారుజామున నిద్రలోనే ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారు. ఆమె ఎంతో ధైర్యశీలమైన అమ్మాయి... రాణిలా బతికారు' అంటూ కుటుంబ సభ్యులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో తమ కుటుంబానికి తగిన గోప్యతను ఇవ్వాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు.
ALSO READ : ఇంటెన్స్ థ్రిల్లర్‌గా రాహుల్ విజయ్ కొత్త సినిమా ‘అ’ టైటిల్, ఫస్ట్ లుక్
ముంబైకి చెందిన అనన్య రాజ్.. హిందీతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. తెలుగులో ఆమె నటించిన 'తగ్గేదే లే' చిత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. యువ వయసులో ప్రతిభావంతురాలైన నటిని కోల్పోవడం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) తో పాటు పలువురు సినీ ప్రముఖులు అనన్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సంతాపం తెలిపారు. అనన్య భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆమె నటన , జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయన్నారు.
