కూకట్ పల్లిలో పార్కుకోసం.. కాలనీ వాసుల నిరసన

కూకట్ పల్లిలో పార్కుకోసం.. కాలనీ వాసుల నిరసన

హైదరాబాద్: కూకట పల్లిలో  పార్కుకు స్థలం కేటాయించాలని నిరసనకు దిగారు కూకట్ పల్లి పరిధిలోని హైదర్ నగర్ లో హెచ్ ఎం డీఏ స్థలంలో  పార్కును నిర్మించాలని కాలనీ వాసులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పిల్లలు , పెద్దలు ప్లకార్డులు పట్టుకొని  నినాదాలు చేశారు.  కాలనీ వాసుల నిరసనలకు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మద్దతుతెలిపారు. 

కూకట్ పల్లి పరిధిలోని హైదర్ నగర్ లో పిల్లలు ఆడుకునేందుకు పార్కు లేకపోవడంతో చాలా రోజులుగా స్థలంగా కావాలని  అధికారులను కోరుతున్నారు. ఈ క్రమంలో  కాలనీలో ఉన్న హెచ్ ఎండీఏ స్థలంలో పార్కును నిర్మించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు విజ్ణప్తి చేశారు. అయితే అదే హెచ్ ఎండీఏ  స్థలాన్ని వేలానికి పెట్టడంతో  నిరసనకు దిగారు. కాలనీలో ఎక్కడా పార్కు లేదని, అపార్టుమెంట్ వాసులకు  ఉపయోగపడేలా పార్కును అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.