శ్రావణ మాసంలో శుక్ల పక్ష పంచమి రోజున ( ఆగస్టు17) నాగపంచమి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. నాగదేవతలు భూమిని, జలాలను, సంపదలను కాపాడే దైవశక్తులుగా పురాణాలు పేర్కొంటాయి.
నాగారాధన వలన ఏం జరుగుతాయి
- సర్పదోష నివారణ
- కాలసర్పదోష శాంతి
- సంతాన ప్రాప్తి
- కుటుంబ సౌఖ్యం
- వ్యవసాయాభివృద్ధి
- ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వాసం
హిందూ ధర్మంలో నాగదేవతలకు ఎంతో విశిష్ట స్థానం ఉంది. పురాణాల ప్రకారం ఈ తొమ్మిది మంది ప్రధాన నాగదేవతలను నవ నాగులు అని పిలుస్తారు. నాగుల పంచమి రోజున వీరిని పూజించడం వలన సంతాన సమస్యలతో పాటు జాతకదోషాలకు విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
నవ నాగుల పేర్లు
- అనంత (ఆదిశేషుడు)
- వాసుకి
- శేష
- పద్మనాభ
- కంబళ
- శంఖపాల
- ధృతరాష్ట్ర
- తక్షక
- కాలీయ
నవ నాగులను ఎందుకు పూజిస్తారు?
- సర్పదోష నివారణ కోసం
- సంతాన ప్రాప్తి కోసం
- కుటుంబ సౌఖ్యం కోసం
- ఆరోగ్యం మరియు ఆయురారోగ్యాల కోసం
- వ్యవసాయ భూములు, పంటల రక్షణ కోసం
- వంశాభివృద్ధి కోసం
- కుజదోష, నాగదోష శాంతి కోసం
ప్రతి నాగుని విశిష్టత
- అనంతుడు (ఆదిశేషుడు) : విష్ణుమూర్తి శయనించే శేషనాగుడు. స్థిరత్వం, ఐశ్వర్యానికి ప్రతీక.
- వాసుకి : క్షీరసాగర మథనంలో తాడుగా ఉపయోగించబడిన నాగరాజు. శక్తి, విజయానికి చిహ్నం.
- శేషుడు : భూమిని తన ఫణాలపై ధరించి ఉన్నాడని పురాణాలు చెబుతాయి. రక్షణకు ప్రతీక.
- పద్మనాభుడు : సంపద, శుభం, ఆధ్యాత్మిక అభివృద్ధిని ప్రసాదిస్తాడు.
- కంబళుడు: వ్యాధులు, దుష్టశక్తుల నుండి రక్షిస్తాడని విశ్వాసం.
- శంఖపాలుడు: భక్తులను కాపాడే నాగదేవుడు. శాంతి, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడు.
- ధృతరాష్ట్రుడు: రాజయోగం, నాయకత్వ లక్షణాలు, గౌరవాన్ని ప్రసాదిస్తాడు.
- తక్షకుడు: మహాభారతంలో ప్రసిద్ధి చెందిన నాగరాజు. శత్రు బాధల నివారణకు పూజిస్తారు.
- కాలీయుడు : శ్రీకృష్ణుడు నాట్యం చేసిన నాగుడు. అహంకార నాశనం, భక్తి పెంపుకు ప్రతీక.
నాగుల పంచమి విశిష్టత
- నాగదేవతలు భూమి, జలాలు, ప్రకృతి రక్షకులుగా భావించబడతారు.
- నాగులను పూజించడం ద్వారా ప్రకృతిని గౌరవించినట్లు భావిస్తారు.
- నాగుల పంచమి రోజున పాలు, పసుపు, కుంకుమ, పువ్వులతో పూజిస్తారు.
- ఈ పూజ వల్ల నాగదోషాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని నమ్మకం.
"అనంతో వాసుకిః శేషః పద్మనాభశ్చ కంబలః ।
శంఖపాలో ధృతరాష్ట్రస్తక్షకః కాలియస్తథా ॥"
నవ నాగ దేవతల అనుగ్రహం ఉంటే ఆయురారోగ్యాలు, సంతాన సౌభాగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
►ALSO READ | నీతికథ : ఒకరికి సాయం చేస్తే.. మనకు రెట్టింపు ఫలితం ఉంటుంది
