హైదరాబాద్‌సిటీ, వెలుగు: సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి పంపింగ్ మెయిన్ జంక్షన్, గ్రావిటీ మెయిన్‌కు ఎంఎస్–పీఎస్సీ పైపుల అనుసంధాన, పెద్దాపూర్ క్యాంపస్‌లోని ఫేజ్–4 పంప్‌హౌస్‌లో వాల్వుల మార్పిడి పనులు చేపట్టనున్నారు. ఇవి సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు జరుగుతాయి. ఈ కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని మెట్రోవాటర్‌బోర్డు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ట్రాన్స్‌మిషన్ డివిజన్–2 పరిధిలోని బీహెచ్ఈఎల్, ఎంఐజీఐ 1, 2, రైల్‌విహార్, చందానగర్, ఇండియన్స్కూల్ఆఫ్బిజినెస్, కేపీహెచ్‌బీ కాలనీ, షేక్‌పేట్, కోకాపేట్, మణికొండ, నార్సింగి, గాయత్రీనగర్, బోరబండ, ఈఎస్ఐ ప్రాంతాలకు నీటి సప్లై బంద్అవుతుందని పేర్కొన్నారు. అలాగే, ఎస్.ఆర్.నగర్, ఎర్రగడ్డ, ఎల్లారెడ్డిగూడ, అమీర్‌పేట్, వెంగళరావునగర్, సనత్‌నగర్, నిమ్స్, బంజారాహిల్స్, తట్టిఖానా, సోమాజీగూడ, బి.ఎస్.మక్తా, ఎం.ఎస్. మక్తా, కొండాపూర్, ఆదిత్యనగర్, ప్రేమ్‌నగర్, హఫీజ్‌పేట్, మయూరినగర్, గోకుల్ ప్లాట్స్, మలేషియన్ టౌన్‌షిప్, హైదర్‌నగర్, రెడ్డీస్ ల్యాబ్స్, కోకాకోలా, ఐడీఏ బొల్లారం తదితర ప్రాంతాల్లో లోప్రెషర్‌తో నీటి సరఫరా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
