నల్లబెల్లి, వెలుగు : కోతుల దాడిలో గాయపడిన ఓ రైతు ట్రీట్ మెంట్ తీసుకుంటూ శనివారం చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే... వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నందిగామకు చెందిన వర్నే యాదగిరి (51) నాలుగు రోజుల కింద పొలం నుంచి ఇంటికి వస్తున్నాడు. మార్గమధ్యలో కోతుల గుంపు దాడి చేయడంతో యాదగిరి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ములుగు జిల్లా హాస్పిటల్ కు తరలించారు. రెండు రోజుల తర్వాత వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లగా.. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ శనివారం ఉదయం చనిపోయాడు.
