ఢిల్లీలో మొబైల్ ఇంటర్నెట్ బంద్.. డిజిటల్ పేమెంట్స్ కు అంతరాయం

ఢిల్లీలో మొబైల్ ఇంటర్నెట్ బంద్.. డిజిటల్ పేమెంట్స్ కు అంతరాయం

సీఈసీజ్ణానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ సెంట్రల్ ఢిల్లీలో సీజేపీ, ఆప్,  వివిధ పార్టీల ఆందోళన క్రమంలో పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు.  జంతర్ మంతర్ తోపాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. భారీ కేడ్లను ఏర్పాటు చేసి నిరసనల కారులను అడ్డుకున్నారు. నిరసనల క్రమంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. జంతర్ మంతర్ చుట్టూ సుమారు 1.5 కిలోమీటర్ల పరిధిలో అర్ధరాత్రి వరకు మొబైల్ ఇంటర్నెట్ బంద్ చేశారు.  దీంతోపాటు ఉబర్, ఓలా యాప్ బుకింగ్  సేవలను కూడా అంతరాయం ఏర్పడింది. యూపీఐ సేవలు భారత ట్యాక్సీ, ఫోన్ పే, గూగుల్ పే  సేవలు కూడా నిలిచిపోయాయి. 

న్యూఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరసనల క్రమంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక ఓటరు జాబిగా సవరణ (SIR)కు వ్యతిరేకంగా, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ సీజేపీ, వివిధ రాజకీయ పార్టీలు, యువత నిరసనలకు పిలుపునిచ్చారు.  జంతర్ మంతర్, జై సింగ్ రోడ్, అశోక్ రోడ్, ఫిరోజ్ షా రోడ్, జన్‌పథ్ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. డ్రోన్లతో పర్యవేక్షణ చేపట్టడంతో పాటు సోషల్ మీడియాపైనా నిఘా పెట్టారు.
అయితే నిరసనలకు  అనుమతి ఇవ్వని పోలీసులు.. న్యూఢిల్లీలో బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు, ధర్నాలు చేయొద్దని ఆంక్షలు విధించారు. 

ఇదిలా ఉండగా.. భద్రతా కారణాలతో 11 ఢిల్లీ మెట్రో స్టేషన్లను మూసివేశారు. అయితే కొన్ని ప్రధాన స్టేషన్లలో ఇంటర్‌చేంజ్ సౌకర్యం కొనసాగుతోంది.