కెనరా బ్యాంక్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 1 నుంచి 17వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్.
మొత్తం ఖాళీలు: 3500. తెలంగాణ రాష్ట్ర పరిధిలో 134 ఖాళీలు ఉన్నాయి.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు 2023, జనవరి 1 కంటే ముందు, 2026, సెప్టెంబర్ 1 తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండకూడదు. అభ్యర్థులు తాము ఎంచుకున్న స్థానిక భాషను పదో తరగతి లేదా 12వ తరగతిలో అభ్యసించినట్లు ధ్రువీకరించే మార్క్స్ షీట్ లేదా సర్టిఫికెట్‌ను సమర్పిస్తే వారికి స్థానిక భాషా పరీక్ష నుంచి మినహాయింపు లభిస్తుంది. ఈ సర్టిఫికెట్లు లేని ఇతర అభ్యర్థులకు, ధ్రువపత్రాల పరిశీలన సమయంలో స్థానిక భాషా పరీక్షను నిర్వహిస్తారు.
వయసు: 2026, సెప్టెంబర్ 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 1.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు ఫీజు ఉండదు. ఇతరులు రూ.500 చెల్లించాలి.
లాస్ట్ డేట్: అక్టోబర్ 17.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్మీడియట్/ డిప్లొమాలో సాధించిన మార్కుల ఆధారంగా రాష్ట్రాల వారీగా షార్ట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
స్టైఫండ్: ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెలా రూ.16,650 చెల్లిస్తారు.
అప్రెంటిస్షిప్ కాలం: 12 నెలలు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.canarabank.bank.inను సందర్శించండి.
►ALSO READ | డ్రైవింగ్, వంట వచ్చా ? కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. 40 ఏళ్ల వరకు ఛాన్స్..
