హైదరాబాద్ ECILలో 310 ఉద్యోగాలు.. నెలకు రూ.8వేల స్టైఫండ్.. ITI చేసినోళ్లు మిస్సవకండి..

హైదరాబాద్ ECILలో 310 ఉద్యోగాలు.. నెలకు రూ.8వేల  స్టైఫండ్.. ITI చేసినోళ్లు మిస్సవకండి..

హైదరాబాద్​లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 30న ప్రారంభమైంది. అక్టోబర్ 11 వరకు అప్లై చేయవచ్చు. 

పోస్టు పేరు: ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్. 

మొత్తం ఖాళీలు: 310. 

విభాగాల వారీగా ఖాళీలు: ఫిట్టర్ 87, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ (ఈఎం) 86, టర్నర్ 8, మషినిస్ట్ 7, మషినిస్ట్ (జీ) 2, వెల్డర్ 16, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (సీఓపీఏ) 41, మెకానిక్ -(రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్) 5, పెయింటర్ 2, కార్పెంటర్ 2, ప్లంబర్ 2, డీజిల్ మెకానిక్ 2, ఎలక్ట్రీషియన్ 50. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్‌‌‌‌‌‌‌‌లో ఐటీఐ/ఎన్‌‌‌‌‌‌‌‌సీవీటీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

వయసు: 2026, అక్టోబర్ 31 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.  

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 30.

లాస్ట్ డేట్: అక్టోబర్ 11. 

డాక్యుమెంట్ వెరిఫికేషన్: అక్టోబర్ 22 నుంచి 24 వరకు. 

అప్రెంటిస్​షిప్ ట్రైనింగ్ ప్రారంభం: నవంబర్ 2. ఎంపికైన ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ అభ్యర్థులకు నెలకు రూ.7,700 నుంచి రూ.8,050 వరకు నెలవారీ స్టైఫండ్ చెల్లిస్తారు.

ట్రైనింగ్ లొకేషన్: ఈసీఐఎల్, హైదరాబాద్–500062, తెలంగాణ. 

సెలెక్షన్ ప్రాసెస్:  ఐటీఐలో సాధించిన మార్కుల  ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

కోటా కేటాయింపు: మొత్తం సీట్లలో ప్రభుత్వ ఐటీఐవిద్యార్థులకు  70 శాతం, ప్రైవేట్ ఐటీఐ విద్యార్థులకు 30 శాతం కేటాయించనున్నారు.

మరిన్ని వివరాలకు వెబ్ సైట్ www.ecil.co.inను సందర్శించండి.

►ALSO READ | కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు.. నెలకు రూ. 16,650 స్టైఫండ్‌.. అర్హత, పూర్తి వివరాలు ఇవే!