ఆగస్టు 19 నుంచి పోలీస్ అప్లికేషన్లు షురూ..వయోపరిమితి ప్రకారం నోటిఫికేషన్‌‌లో మార్పులు

ఆగస్టు 19 నుంచి పోలీస్ అప్లికేషన్లు షురూ..వయోపరిమితి ప్రకారం నోటిఫికేషన్‌‌లో మార్పులు

హైదరాబాద్‌‌, వెలుగు: కానిస్టేబుల్‌‌, ఎస్సై పోస్టుల భర్తీకి ఈ నెల19 నుంచి ఆన్‌‌లైన్ అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌‌ 9న సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. మరోవైపు అభ్యర్థుల వయస్సు సడలింపునకు సంబంధించి  తెలంగాణ స్టేట్‌‌ లెవల్‌‌ పోలీస్‌‌ రిక్రూట్‌‌మెంట్ బోర్డు (టీఎస్‌‌ఎల్‌‌పీఆర్‌‌‌‌బీ) నోటిఫికేషన్లలో మార్పులు చేసింది. గతంలో విడుదల చేసిన నాలుగు నోటిఫికేషన్లలోనూ నిర్ధేశిత వయస్సు వివరాలను పొందుపరిచింది. 

ఈ మేరకు బోర్డు చైర్మన్‌‌ వీవీ శ్రీనివాసరావు శనివారం మరో నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కానిస్టేబుల్​కు అభ్యర్థుల  గరిష్ట వయస్సు 29 ఏండ్లకు పెరగనుండగా.. ఎస్సై పోస్టులకు గరిష్ట వయస్సు 32 ఏండ్లకు పెరగనుంది. దీనికి అదనంగా ఆయా రిజర్వేషన్‌‌ కేటగిరీల వారీగా అదనపు సడలింపు వర్తిస్తుంది. ఈ మేరకు tgprb.in వెబ్‌‌సైట్‌‌ ద్వారా ఆన్‌‌లైన్‌‌ దరఖాస్తు ఫారాలు పంపించాలని చైర్మన్‌‌ శ్రీనివాస రావు సూచించారు.