రేపే(ఆగస్టు 17) ‘సర్’ ముసాయిదా ఓటర్ల జాబితా

రేపే(ఆగస్టు 17) ‘సర్’ ముసాయిదా ఓటర్ల జాబితా
  •     73.39 లక్షల ఓట్ల తొలగింపుపై అప్రమత్తమైన ప్రధాన పార్టీలు
  •     అర్హులకు మళ్లీ చాన్స్
  •     బూత్ లెవెల్ ఏజెంట్లను రంగంలోకి దింపిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ
  •     డూప్లికేట్, అడ్రస్ మారిన ఓట్లపైనే దృష్టి  
  •     ఓటు బ్యాంకు కాపాడుకునేందుకు కంట్రోల్ రూమ్‌లు

హైదరాబాద్, వెలుగు: స్పెషల్ ఇంటెన్సివ్​రివిజన్ (సర్​)​  ప్రక్రియలో తొలగింపునకు గురవుతున్న 73.39 లక్షల ఓటర్లలో  అర్హులను మళ్లీ జాబితాలో నమోదు చేసేందుకు అన్ని పొలిటికల్ పార్టీలు రెడీ అయ్యాయి. భారీ సంఖ్యలో ఓట్ల తొలగిపోయే చాన్స్ ఉండటంతో  కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు అప్రమత్తమయ్యాయి. సర్ ముసాయిదా ఓటర్ల జాబితా సోమవారం (ఈ నెల 17న) వెలువడనుంది.  గత కొంతకాలంగా డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వారి పేర్లు, చిరునామాలు మారిన ఓటర్లు, ఇతర కారణాలతో  తొలగింపుపై పార్టీలు ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో  డ్రాఫ్ట్ రోల్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఇప్పుడు ఇచ్చే ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ పూర్తయిన తరువాత ఫైనల్​ జాబితా వస్తుంది. దీని ప్రకారమే జీహెచ్​ఎంసీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు భవిష్యత్​ ఎలక్షన్స్​ జరగనున్నాయి. దీంతో  తొలగింపు లిస్ట్​లో ఉన్న ప్రతి ఒక్క ఓటును నిశితంగా పరిశీలించడంతో పాటు అందులో అర్హత ఉన్నవాటిని ఈ నెల రోజుల్లోనే మళ్లీ జాబితాలోకి తీసుకురావాలని భావిస్తున్నాయి. ఓటు బ్యాంకు కాపాడుకునేందుకు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ మేరకు ప్రధాన పార్టీలు తమ గ్రౌండ్ లెవెల్ కేడర్‌ను ఇప్పటికే సమాయత్తం చేశాయి.

ఫారమ్-8 ద్వారా సవరణకు అవకాశం

ఓటర్ల ముసాయిదా ప్రకటనకు ఎన్నికల అధికారులు  అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆగస్టు 17న డ్రాఫ్ట్ విడుదలైన వెంటనే దరఖాస్తులు, నోటీసుల స్వీకరణ ప్రారంభం కానుండటంతో ఓటర్ల నమోదు అధికారులు (ఈఆర్​ఓ),  ఏఈఆర్ ఓలు, బీఎల్ఓలు క్షేత్రస్థాయి విచారణలను వేగవంతం చేయనున్నారు. ఓటర్లు సైతం తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో సరిచూసుకునేందుకు వీలుగా మీసేవ సెంటర్లు, ఆన్‌లైన్ పోర్టల్స్ అందుబాటులో ఉంచారు. 

జాబితాలో పేర్లు లేని అర్హులు ఫారమ్-6 ద్వారా నూతన నమోదుకు, తప్పులు ఉన్నవారు ఫారమ్-8 ద్వారా సవరణలకు, అలాగే అర్హత లేని ఓట్ల తొలగింపుకు ఫాం-7 ద్వారా దరఖాస్తు చేసుకునే వీలుంది. తొలగింపులో ఉన్న ఓటర్లలో మొత్తం 73 లక్షలు ఉండగా అందులో మరణించిన వారివి, ఇప్పటికే ఎన్​రోల్​ అయిన వాటిలో అర్హులు ఎవరు ఉండరని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వాటిని నిశితంగా పరిశీలించి, వెరిఫై చేసుకున్న తరువాతే తీసేస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ కొత్తగా అభ్యంతరాలు, ఫిర్యాదుల్లో వచ్చే ఓటర్లలో  శాశ్వతంగా నివాసం మారినవారు  45.18 లక్షలు,  అబ్సెంట్​, ఆన్​ట్రేసేబుల్​  11.25 లక్షలు, ఇతర కారణాలు 1,02,294  ఓటర్లు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు