Mahesh Babu: 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'కు మహేష్ బాబు రివ్యూ.. ఫహద్ ఫాజిల్‌పై ఆసక్తికర కామెంట్స్!

Mahesh Babu: 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'కు మహేష్ బాబు రివ్యూ.. ఫహద్ ఫాజిల్‌పై ఆసక్తికర కామెంట్స్!

మలయాళ వెర్సటైల్ నటుడు ఫహద్ ఫాజిల్ టాలీవుడ్‌లో సరికొత్త మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' అక్టోబర్ 2న థియేటర్లలోకి రాబోతోంది. రాజమౌళి సమర్పణలో, ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో కలిసి ఎస్.ఎస్. కార్తికేయ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. డెబ్యూ డైరెక్టర్ శశాంక్ ఏలేటి తెరకెక్కించిన ఈ చిత్రంపై ఇప్పటికే సినీ ప్రియుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఇప్పటికే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరై సినిమా రేంజ్‌ను పెంచగా.. లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇచ్చిన రివ్యూతో మూవీ హడావుడి నెక్స్ట్ లెవెల్‌కు చేరింది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన స్పెషల్ స్క్రీనింగ్ చూసిన మహేష్ బాబు, సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకుంటూ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ఒక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. సినిమాలో మైండ్ బ్లాకింగ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు హృదయాలను హత్తుకునే బలమైన ఎమోషన్ ఉంది. కథ సాగినంత సేపూ ఒక రకమైన అరుదైన ఆత్మీయత మిమ్మల్ని కట్టిపడేస్తుంది అని మహేష్ బాబు పోస్ట్ చేశారు. ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ గురించి చెబుతూ.. 'ఫహద్ సర్, మీరు నటనలో మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకునే తీరు నిజంగా స్ఫూర్తిదాయకం. ఈ సినిమాలో చిన్నారి సారాతో కలిసి మీరు చేసిన మేజిక్ స్క్రీన్ పై అద్భుతంగా పండింది' అని కొనియాడారు.

►ALSO READ | Free OTT Movies: మైండ్ బ్లాకింగ్ ట్విస్టులతో మూడు సినిమాలు.. రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ఇక ఈ చిత్రంతో ప్రొడ్యూసర్‌గా మారుతున్న ఎస్.ఎస్. కార్తికేయను మహేష్ బాబు అభినందించారు. కార్తికేయ ఒక ప్రొడ్యూసర్‌గా నీకు ఇంతకంటే గ్రాండ్ బిగినింగ్ ఉండదు. ఈ సినిమా కోసం పడిన కష్టానికి ఫలితం దక్కింది, ఇక నువ్వు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవచ్చు. శోభు మరియు డైరెక్టర్ శశాంక్ కలిసి ఒక విజువల్ వండర్‌ను మన ముందుకు తెచ్చారు అని రివ్యూ చేస్తూ ట్వీట్ చేశారు మహేష్ బాబు.

 

గ్లోబల్ డైరెక్టర్ రాజమౌళి విజన్, ఎన్టీఆర్ ఆశీస్సులు, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇచ్చిన సాలిడ్ సర్టిఫికెట్‌‌తో 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' బాక్సాఫీస్ వద్ద  అంచనాలు భారీగా ఉన్నాయి. . అక్టోబర్ 2న థియేటర్లలో ఎలాంటి రికార్డు సృష్టిస్తోందో చూడాలి.