వన్డేల్లో శుభ్‌మన్ గిల్ వీరవిహారం.. కేవలం 117 బంతుల్లోనే డబుల్ సెంచరీ.. 

వన్డేల్లో శుభ్‌మన్ గిల్ వీరవిహారం.. కేవలం 117 బంతుల్లోనే డబుల్ సెంచరీ.. 

Shubman Gill Double Century: గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అద్భుతమైన బ్యాటింగ్‌తో చరిత్ర సృష్టించాడు. 406 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా గిల్ మైదానంలో పరుగుల సునామీ సృష్టించి, డబుల్ సెంచరీతో జట్టును పూర్తిగా విజయం వైపు నడిపిస్తున్నాడు. విరాట్ కోహ్లీ (29 పరుగులు) తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ, కెప్టెన్‌గా పూర్తి బాధ్యత వహించిన ప్రిన్స్ కరేబియన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

కేవలం 117 బంతుల్లోనే గిల్ డబుల్ సెంచరీ: 

406  పరుగుల లక్ష్య ఛేదనలో ఎలాంటి భయం లేకుండా ఎదురుదాడికి దిగిన శుభ్‌మన్ గిల్.. విండీస్ బౌలర్ల వ్యూహాలను పూర్తిగా బ్రేక్ చేసేశాడు. మైదానంలో నలుమూలలా షాట్లు బాదుతూ క్రమం తప్పకుండా బౌండరీలు సాధించిన గిల్, కేవలం 117 బంతుల్లోనే 200 పరుగుల మార్కును అందుకున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా అత్యంత వేగంగా డబుల్ శతకం బాదిన రికార్డును గిల్ తన ఖాతాలో వేసుకున్నాడు.

►ALSO READ | రోహిత్ శర్మ 101కి ఔట్.. వెంటనే హిట్‌మ్యాన్ సెంచరీ సెలబ్రేషన్‌ను రీక్రియేట్ చేసిన సీల్స్!

వన్డేల్లో గిల్‌కు ఇది రెండో డబుల్ సెంచరీ: 

వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ సాధించిన ఈ డబుల్ సెంచరీ అతని వన్డే కెరీర్‌లో రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. అంతకుముందు 2023లో న్యూజిలాండ్‌పై హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గిల్ తన తొలి డబుల్ సెంచరీని నమోదు చేశాడు. ఇప్పుడు మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయిన గిల్, ఒత్తిడిలోనూ బాధ్యతాయుతమైన ఆటతీరుతో జట్టును విజయతీరాల వైపు నడిపిస్తున్నాడు.

వన్డేలలో ఛేజింగ్ సమయంలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు:

* 203* - శుభ్‌మన్ గిల్ (భారత్) vs వెస్టిండీస్, గౌహతి, 2026, ఈ రాత్రి*

* 201* - గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) vs ఆఫ్ఘనిస్తాన్, వాంఖేడే, 2023

* 193 - ఫఖర్ జమాన్ (పాకిస్తాన్) vs దక్షిణాఫ్రికా, జోహన్నెస్‌బర్గ్, 2021