గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మరో అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయాడు. 405 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ కిరాక్ బ్యాటింగ్ ప్రదర్శన కనబరుస్తూ జట్టుకు మంచి ఆరంభాన్ని అందించాడు. ఈ క్రమంలో శతకం తర్వాత హిట్ మ్యాన్ చేసిన ఓ సెలబ్రేషన్ ని విండీస్ బౌలర్ ఎగతాలి చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
సెంచరీ తర్వాత రోహిత్ సెలబ్రేషన్స్:
సింగిల్ తీసి తన కెరీర్‌లో 35వ వన్డే సెంచరీని పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ, ఆ సమయంలో సరదాగా మైదానంలో జంపింగ్ చేశాడు. రోహిత్ ఫిట్‌నెస్‌పై విమర్శలు చేసే వారికి తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. కానీ, సెంచరీ పూర్తి చేసుకున్న కొద్దిసేపటికే విండీస్ పేసర్ జైడెన్ సీల్స్ బౌలింగ్‌లో హిట్ మ్యాన్ వెనుదిరగాల్సి వచ్చింది.
వెస్టిండీస్ బౌలర్ జైడెన్ సీల్స్ ఓవర్యాక్షన్:
సీల్స్ వేసిన బంతి రోహిత్ ప్యాడ్స్‌కు తగలడంతో వెస్టిండీస్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేయగా, అంపైర్ ఎల్బీడబ్ల్యూ రూపంలో రోహిత్ అవుటైనట్లు ప్రకటించారు. వికెట్ తీసిన ఆనందంలో జైడెన్ సీల్స్.. రోహిత్ సెంచరీ చేసినప్పుడు జంప్ చేస్తున్నట్లు చేసిన సెలబ్రేషన్‌ను మైదానంలో అనుకరిస్తూ రీక్రియేట్ చేశాడు. దీనిపై రోహిత్ రివ్యూ కోరినప్పటికీ, రిప్లేలో అల్ట్రాఎడ్జ్ ద్వారా బ్యాట్ తగలలేదని, బాల్-ట్రాకింగ్‌లో బంతి నేరుగా స్టంప్స్‌కు తగులుతున్నట్లు కనిపించడంతో అంపైర్ నిర్ణయం సరైందిగా తేలింది.
►ALSO READ | చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వన్డేల్లో 12 వేల రన్స్ చేసిన హిట్‌మ్యాన్!
చరిత్ర సృష్టించిన రోహిత్-గిల్ భాగస్వామ్యం:
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ జోడీ అద్భుతమైన ఆటతీరుతో ఏకంగా 255 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ శతకంతో రోహిత్ శర్మ వన్డేల్లో సెంచరీ సాధించిన అత్యంత పెద్ద వయసున్న భారత బ్యాటర్‌గా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జోడీ భారత్‌ను పటిష్ట స్థితిలో నిలిచింది.
