జ్యోతిష్యం: సింహరాశిలో సూర్యుడు.. కేతువు.. నాలుగు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.. చేయాల్సిన పరిహారాలు ఇవే..!

జ్యోతిష్యం:  సింహరాశిలో సూర్యుడు.. కేతువు.. నాలుగు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.. చేయాల్సిన పరిహారాలు ఇవే..!

నవగ్రహాలకు రాజు సూర్యుడు.   సూర్యుడు  తన సొంత రాశి సింహరాశిలోకి  ఆగస్టు 17  నాగపంచమి రోజున ఉదయం ఉదయం 7:58 గంటలకు  ప్రవేశించనున్నాడు.  అప్పటికే సింహరాశిలో ఉన్న ఛాయా గ్రహమైన కేతువుతో కలిసి సూర్యుడు సంచరించనున్నాడు. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో సంచరించడం వలన నాలుగు రాశుల ( మిథున, సింహ, మకర, కుంభ) వారికి  వృత్తి, ఆరోగ్యం, ఆర్థిక పరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  ఇ ప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం.  . 

మిథునరాశి:  ఈ రాశి మూడవ ఇంట్లో సూర్యుడు.. కేతువు కలిసి సంచారం చేయబోతున్నారు. ఈ ప్రభావం వలన ఈ  రాశి వారికి ఖర్చులు, పని  భారం పెరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో అనవసరంగా అవమానాలు పడతారు. తోటి ఉద్యోగులు వలన సమస్యలు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఇతరులతో మాట్లడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండంది. చిన్న విషయం వివాదంగా మారే అవకాశం ఉంది. ఎవరికి హామీ ఉండవద్దు.  వ్యాపారస్తులు ఆచితూచి పెట్టుబడులు పెట్టాలని పండితులు సూచిస్తున్నారు.  మంగళవారం హనుమంతుడికి ఆకుపూజ, రోజూ సూర్యనమస్కారాలు చేయడం వలన పరిస్థితులు అనుకూలంగా మారతాయని పండితులు చెబుతున్నారు. 

సింహరాశి:  ఈ రాశి లగ్నంలో అంటే  మొదటి ఇంట్లో, సూర్యుడు, -కేతువు కలిసి సంచరించబోతుతున్నారు.  దీని వలన ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసంలో లోపిస్తుందని పండితులు చెబుతున్నారు. ప్రతి విషయంలో కూడా నిర్ణయం తీసుకొనేందుకు చాలా ఇబ్బంది పడుతుంటారు.  గందరగోళంగా ఆలోచనలు వస్తుంటాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ఫలితం లభించకపోవచ్చు. ప్రతి పనిలో కూడా నిరాశ కలుగుతుంది. ప్రతి విషయం సవాలుగా మారుతుంది. జాయింట్​ వ్యాపారాల విషయంలో ఇబ్బందులు వస్తాయి.తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  కుటుంబంలో చిన్న చిన్న విషయాలకు కూడా కూడా ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది.  ప్రతి విషయంలో కూడా ఓర్పు.. సహనం చాలా అవసరమనిజ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ రాశి వారు ప్రతి సోమవారం పరమేశ్వరునికి రుద్రాభిషేకం.. ప్రతిరోజు ఆదిత్యహృదయం పఠించడం వలన చాలా వరకు ఉపశమనం కలుగుతుంది.

►ALSO READ | నీతి కథ : వేటగాడికి బుద్ధి చెప్పిన జింక, కాకి, ఏనుగు.. అడవిని ఎలా రక్షించుకున్నాయో తెలుసుకుందామా..!

మకర రాశి :  ఈ రాశి ఎనిమిదవ ఇంట్లో సూర్యుడు.. కేతువు సంచారం జరుగుతుంది. ఈ రాశికి చెందిన యజమాని కుటుంబసభ్యులు అందరి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిపనిలో కూడా ఒత్తిడి ఎదుర్కొంటారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. బంధువులు.. స్నేహితుల వలన  సమస్యలు వస్తాయి.  మీ మాటలను నియంత్రించుకోవడం చాలా అవసరం.  ఎట్టి పరిస్థితిలో  ఎవరికి అప్పు ఇవ్వవద్దు. అశాంతితో నిద్ర లేకుండా గడిపాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులు మీ పని మీరు చేసుకోండి.  ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దని పండితులు చెబుతున్నారు.  ఈ రాశి వారు ప్రతి రోజు సూర్యష్టకం.. ఆదిత్య హృదయం... దక్షిణామూర్తి స్త్రోత్రం చదవుకోండి. కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. 

కుంభ రాశి: ఈ రాశి ఏడవ ఇంట్లో సూర్యుడు..-కేతువులు కలిసిసంచారం ప్రారంభించనున్నారు. దీని ప్రభావం వలర ఈ రాశికి చెందిన  వ్యాపారస్థులకు.. ఉద్యోగస్తులకు ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది ఆఫీసులో  కష్టపడి పనిచేసినా ఫలితం రాదు. తోటి ఉద్యోగుల సహకారం లేకపోవడంతో కొన్ని అదనపు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగానే సాగుతాయి. పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో చాలా  జాగ్రత్త వహించాలి. ఎట్టి పరిస్థితిలో కీలక  ఒప్పందాలు చేసుకోవద్దు.  ఆర్థిక విషయాలకు సంబంధించి ఆందోళన పెరిగే అవకాశం ఉంది. ఖర్చులను నియంత్రించడం చాలా మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.  ఈ రాశి వారు  శని వారం శని భగవానుడికి నువ్వులనూనెతో అభిషేకం.. మంగళవారం ఆంజనేయస్వామికి వడమాల సమర్పించండి. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.