వారఫలాలు ( ఆగస్టు 16–22) : గ్రహాల రాజు సూర్యుడు రాశి మారుతున్నాడు.. 12 రాశులపై ప్రభావం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది..!

వారఫలాలు ( ఆగస్టు 16–22) : గ్రహాల రాజు సూర్యుడు రాశి మారుతున్నాడు.. 12 రాశులపై ప్రభావం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది..!

వారఫలాలు :  ఈ వారం ( ఆగస్టు 16–22)లో గ్రహాల రాజు సూర్యుడు.. ఛాయ గ్రహమైన కేతువుతో కలిసి సింహరాశిలో సంచారం చేయనున్నాడు.  ఈ ప్రభావం అన్ని రాశులపై ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  కొన్ని రాశుల వారికి అదృష్టం వరించగా.. మరికొన్ని రాశుల వారికి మిశ్రమంగా ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు.  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. . .

మేష రాశి: ఈ రాశి వారికి  ఈ వారం  కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి.   ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి.  ఉద్యోగస్తులు ఆచితూచి నిర్ణయంతీసుకోవాలి. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లువిషయంలో జాగ్రత్తగా ఉండాలి.  ప్రేమ వ్యవహారాలకు చాలా దూరంగా ఉండండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు.

వృషభరాశి : ఈ రాశి వారికి ఈ వారం  పరిస్థితి బాగుంటుంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వచ్చే అవకాశం ఉంది.  వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి.  జీవితభాగస్వామిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి... అంతా మంచే జరుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంశలు.. అవార్డులు లభిస్తాయి.  ఈ వారం బంధువుల తాకిడి ఎక్కువ కావడంతో  అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి .  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.

మిథునరాశి :ఈ రాశి వారికి ఈ వారం గందరగోళంగా ఉంటుంది.  ఉద్యోగస్తులు అనవసరంగా మాట పడాల్సిన పరిస్థితులు ఉంటాయి.  వ్యాపారస్తులు ఆచితూచి నిర్ణయం తీసుకోండి. భూవివాదాలు.. ఆస్తి సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాల్లో ఎలాంటి మార్పులు ఉండవు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేసుకోవడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

కర్కాటకరాశి : ఈ రాశికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త  వస్తువుల కొనే అవకాశం ఉంది.  సమాజంలో గౌరవం .. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.  నిరుద్యోగులకు జాబ్​ లభిస్తుంది.  ప్రైవేట్​ ఉద్యోగస్తులు జాబ్​ మారే అవకాశం ఉంది.  వ్యాపారస్తులు కష్టపడాల్సి ఉంటుంది.  కొత్త పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి.  ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. అనవసర పరిచయాలతో నష్టం కలిగే అవకాశం కూడా ఉంది. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి.

సింహ రాశి : ఈ వారం ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులకు లాభాలు రాకపోయినా నష్టం ఉండదు,  ఉద్యోగస్తులకు సామాన్య ఫలితాలుంటాయి. ఆర్థికవిషయాల్లో  ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.  సాధ్యమైనంత వరకు పెట్టుబడులు పెట్టకుండా ఉండటమే మంచిది.  పెళ్లి విషయాన్ని వాయిదా వేయండి.  దూరంగా ఉన్న ప్రేమికులు ఈ వారంలో కలుసుకునే అవకాశం ఉంది. 

కన్య రాశి : ఈ వారం చేపట్టిన పనులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారు.  అనుకోకుండా ఖర్చులు రావడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు  ఉంటాయని పండితులు సూచిస్తున్నారు.  ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చేతివృత్తులు వారు కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. పెళ్లి కోసం ఎదురు చూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు. ప్రేమ.. పెళ్లి  వ్యవహారాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబ జీవితం సాఫీగా, సానుకూలంగా సాగిపోతుంది. 

తులా రాశి : ఈ రాశి వారికి ఈ వారం ఆరోగ్యం మెరుగు పడుతుంది. కోర్టు వ్యవహారాలు చక్కబడతాయి.  కొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకు అనుకూల సమయం.  గతంలో చేతిరాదు అనుకున్న సొమ్ములు వసూలవుతాయి.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. మాట తొందరపాటు వల్ల సమస్యలు తలెత్తుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం నిలకడగా సాగిపోతుంది.నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ లభిస్తుంది.

వృశ్చికరాశి :ఈ రాశి వారు ఈ వారంలో తీసుకునే నిర్ణయాలు లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అయ్యే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఇది అనుకూల సమయం. అయితే ఈ రాశి వారు ఇతరులతో మాట్లడేటప్పుడు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగస్తులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.  వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశాలున్నాయి.  విద్య.ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.  

ధనుస్సురాశి : ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది.  కొత్త వస్తువుల కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అన్ని విధాలా బాగుంటుంది.  అనుకోకుండా లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  ఆదాయం పెరగడంతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి.  భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని  నిర్ణయాలు తీసుకోవాలి. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది.

మకరరాశి :  ఈ రాశి వారు ఈవారం ఆరోగ్య విషయంలో అప్రతమత్తంగా ఉండాలి.   వారం మధ్యలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులు... ఉద్యోగస్తులు అధికంగా శ్రమ పడాల్సి ఉంటుంది.  ఎవరితోను ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దు.  మీ పని మీరు చేసుకోండి.  ఎవరు ఏమన్నా పట్టించుకోకపోవడం చాలా మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.  ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు.  ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆధ్యాత్మిక చింతనతో గడపండి.. అంతా మంచే జరుగుతుంది. 


కుంభ రాశి : ఈ రాశి వారు ఈ వారం ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిపనిలో కూడా ఒత్తిడి ఎదుర్కొంటారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. బంధువులు.. స్నేహితుల వలన  సమస్యలు వస్తాయి.  మీ మాటలను నియంత్రించుకోవడం చాలా అవసరం.  ఎట్టి పరిస్థితిలో  ఎవరికి అప్పు ఇవ్వవద్దు. అశాంతితో నిద్ర లేకుండా గడిపాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులు మీ పని మీరు చేసుకోండి.  ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దని పండితులు చెబుతున్నారు. 

మీనరాశి:  ఈ వారం ఈ రాశి వారికి జ్యోతిష్య నిపుణుల వివరాల ప్రకారం  మెరుగుపడుతుంది. ఉద్యోగులు అన్నీ విధాల బాగుంటుంది. కుటుంబ యజమానికి ... కుటుంబసభ్యుల మద్దతు పుష్కలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు.వ్యాపారస్తులు అనుకున్న లాభాలను గడిస్తారు.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.  ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని  జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం