సనత్‌‌నగర్‌‌ లోని టిమ్స్ రోగులకు ‘అక్షయపాత్ర’ భోజనం

సనత్‌‌నగర్‌‌ లోని టిమ్స్ రోగులకు ‘అక్షయపాత్ర’ భోజనం
  •     ఆపరేషనల్ రెడీనెస్‌‌లో భాగంగా 17 కీలక లైసెన్సుల ప్రక్రియ పూర్తి

హైదరాబాద్‌‌, వెలుగు: సనత్‌‌నగర్‌‌లోని డాక్టర్‌‌ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ మెడికల్‌‌ సైన్సెస్‌‌ (టిమ్స్‌‌)లో రోగులకు పౌష్టికాహారం అందించే బాధ్యతను ‘హరే రామ హరే కృష్ణ’ (అక్షయపాత్ర) సంస్థకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హాస్పిటల్‌‌ డైట్‌‌ మెనూ ప్రకారం రోగులు త్వరగా కోలుకునేలా నాణ్యమైన పౌష్టికాహారాన్ని సంస్థ సరఫరా చేయనుంది.

హాస్పిటల్‌‌ నిర్వహణకు అవసరమైన 17 రకాల కీలక లైసెన్సులు, అనుమతుల ప్రక్రియ పూర్తయింది. ఇందులో జీఎస్టీ, పాన్‌‌, టాన్‌‌ వంటి పన్ను సంబంధిత అనుమతులతో పాటు డ్రగ్స్‌‌ అండ్‌‌ ఫార్మసీ, పీసీపీఎన్‌‌డీటీ, పెసో లైసెన్సులు ఉన్నాయి. బిల్డింగ్‌‌ సేఫ్టీకి సంబంధించి ఫైర్‌‌ ఎన్‌‌ఓసీ, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌‌, ఎన్విరాన్‌‌మెంట్‌‌ క్లియరెన్స్‌‌ సర్టిఫికెట్లు అందాయి. ఎన్డీపీఎస్‌‌, క్లినికల్‌‌ ఎస్టాబ్లిష్‌‌మెంట్స్‌‌, ఎంటీపీ లైసెన్సులు కూడా పొందారు. 

మరిన్ని వార్తలు