రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ సిటీనుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్ల హాల్టింగ్ ప్రాంతాలను పెంచారు. పండుగ రద్దీ దృష్టా లింగంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్లో ప్రయాణికులు అధికంగా వస్తారు కాబట్టి రద్దీని తగ్గించేందుకు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ లో కూడా పలు రైళ్ల హాల్టింగ్ కు అనుమతినిచ్చింది దక్షిణ మధ్య రైల్వే. అక్టోబర్ 9నుంచి 26 వరకు 18 రోజుల పాటు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ హాల్టింగ్ సౌకర్యం కల్పిస్తోంది. ఏయే రైళ్లు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లలో ఆగుతాయో తెలుసుకుందాం.
తాత్కాలికంగా హైటెక్ సిటీలో రైల్వే స్టేషన్ లో ఆగే రైళ్లు, రాక , బయలుదేరే సమయం
రైలు నెం 17255 నరసాపురం – లింగంపల్లి (04.45/04.46),
రైలు నెం 17256 లింగంపల్లి – నరసాపురం (21.08/21.09),
రైలు నెం 12775 కాకినాడ టౌన్ – లింగంపల్లి (07.10/07.11)
రైలు నెం 12776 లింగంపల్లి – కాకినాడ టౌన్ (19.08/19.09).
ఇప్పటికే లింగంపల్లి నుంచి తమ ప్రయాణాన్ని రిజర్వు చేసుకున్న ప్యాసింజర్లు అవసరమైతే ఎటువంటి ఫీజులు లేకుండా బోర్డింగ్ పాయింట్ ను హైటెక్ సిటీకి మార్చుకోవచ్చని దక్షిణ మద్య రైల్వే తెలిపింది.
