మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ( MCU ) నుంచి వస్తున్న మోస్ట్ అవైటెట్ మూవీ ' అవెంజర్స్ : డూమ్స్ డే '. లేటెస్ట్ గా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ ట్రైలర్ మార్వెల్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తూ.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఐరన్ మ్యాన్ గా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న హాలీవుడ్ స్టార్ రాబర్ట్ డౌనీ జూనియర్ ( RDJ ) ఈ సారి హీరోగా కాదు.. భయంకరంమైన విలన్ 'డాక్టర్ డూమ్' గా కనిపించబోతున్నారు. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.
గ్రీన్ హుడ్, మెటల్ మాస్క్‌తో RDJ లుక్ చూస్తేనే విలన్ పవర్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో అర్థమవుతోంది. ట్రైలర్‌లో థోర్‌తో డూమ్ తలపడే సీన్ అయితే గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. చేతిలో స్టార్మ్‌బ్రేకర్‌తో విరుచుకుపడిన థోర్‌ను డూమ్ సింపుల్‌గా అడ్డుకోవడమే కాకుండా.. గ్రీన్ ఎనర్జీ బీమ్‌తో అతడిని మోకాళ్లపై కూర్చోబెట్టడం మామూలు విషయం కాదు. 'హెల్ కూడా నా మాటే వింటుంది.. నేనే డూమ్' అంటూ RDJ చెప్పే డైలాగ్ విలన్ పవర్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్తోంది.
ఇక పెడ్రో పాస్కల్‌కి చెందిన మిస్టర్ ఫెంటాస్టిక్, వెనెస్సా కిర్బీ ఇన్విజిబుల్ ఉమెన్‌తో పాటు థోర్, కెప్టెన్ అమెరికా, బ్లాక్ పాంథర్, వింటర్ సోల్జర్, లోకీ, యాంట్-మ్యాన్ వంటి మార్వెల్ స్టార్ హీరోలంతా ఒక్కచోట చేరడం సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. అంతేకాదు.. ఎక్స్-మెన్‌కు చెందిన క్లాసిక్ విలన్స్ సెంటినెల్స్ కూడా ట్రైలర్‌లో కనిపించడం మరో హైలైట్.
►ALSO READ | 'పాంచాలి పంచభర్తృక' మూవీ రివ్యూ: శవంతో మిస్సైన సూట్‌కేస్.. అసలు ట్విస్ట్ ఏంటంటే?
'ఎండ్‌గేమ్' తర్వాత రాబర్ట్ డౌనీ జూనియర్ ( RDJ ) తిరిగి MCUలోకి రావడం ఇప్పటికే సంచలనం కాగా.. ఈసారి అదే నటుడు హీరోలకు ఎదురుగా నిలబడటం మరింత క్రేజ్ ను తీసుకోస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ ' అవెంజర్స్ : డూమ్స్ డే ' డిసెంబర్ 18న రిలీజ్ కానుంది. మరి ఈ హాలీవుడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డు సృష్టిస్తుందో చూడాలి.
