నటకిరీటి రాజేంద్రప్రసాద్, పృధ్వీరాజ్ కీలక పాత్రలో నటించిన చిత్రం 'పాంచాలి . క్రేజీ టైటిల్ తో ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఈ సీనియర్ నటులతో పాటు పలువురు కొత్త నటీనటులు కీలక పాత్రల్లో నటించడంతో సినిమాపై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. టీజర్, ట్రైలర్లో కనిపించిన కామెడీ, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అంచనాలను పెంచాయి. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది? సినిమా అంచనాలను అందుకుందా? సినీ ప్రియులు అభిప్రాయం ఎలా ఉందో చూద్దాం..
కథేంటి?
డాక్టర్ దమయంతిని డాన్సన్ మనుషులు కిడ్నాప్ చేయడంతో కథ మొదలవుతుంది. ఆమెను చంపేస్తామని బెదిరించి తమ బిజినెస్‌కు సహకరించేలా ఒప్పిస్తారు. మరోవైపు సీరియల్స్ తెరకెక్కించే చిత్తరంజన్‌కు సినిమా తీయాలనే కోరిక ఉంటుంది. సినిమా కోసం ప్రయత్నాలు చేస్తూనే అద్దె ఇంటి కోసం వెతుకుతున్న కాట్రాజ్, పుష్పరాజ్‌లకు పరిచయం అవుతాడు. చివరకు వీరంతా ఒకే అపార్ట్మెంట్లోని పెంట్‌హౌస్‌లో కలిసి ఉండే పరిస్థితి ఏర్పడుతుంది.
అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ బాబ్జీ కూడా వీరి గ్యాంగ్‌లో చేరడంతో నలుగురి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. ఓ రోజు సరదాగా ఓ అమ్మాయిని తమ దగ్గరకు పిలిపించుకోవాలని నిర్ణయించుకుంటారు. అలా సెనోరిటాను ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. అయితే ఆమె వచ్చిన తర్వాత తన బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్పడంతో పరిస్థితులు అనూహ్యంగా మారిపోతాయి. ఆ తర్వాత నలుగురూ కలిసి బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి సెనోరిటా రక్తపు మడుగులో శవమై కనిపిస్తుంది.
అసలు మర్డర్ చేసింది ఎవరు?
సెనోరిటా హత్యతో నలుగురూ షాక్‌కు గురవుతారు. విషయం బయటకు వస్తే తాము ఇబ్బందుల్లో పడతామని భావించి, శవాన్ని సూట్‌కేసులో పెట్టి మాయం చేయాలని ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. శవాన్ని పెట్టిన సూట్కేసే కనిపించకుండా పోతుంది. దీంతో సెనోరిటాను ఎవరు చంపారు? శవంతో ఉన్న సూట్‌కేసు ఎక్కడికి వెళ్లింది? అనే ప్రశ్నలు మొదలవుతాయి.
కథలోకి వచ్చే కీలక పాత్రలు..
ఇదిలా ఉంటే కథలోకి పరమసుందరి, రోజ్మేరి, సీక్రెట్ ఏజెంట్ ఏడుకొండలు అలియాస్ ఎకో వంటి పాత్రలు ఎంట్రీ ఇస్తాయి. వీరి రాకతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. సెనోరిటా హత్యకు వీరికి ఉన్న సంబంధం ఏంటి? డాక్టర్ దమయంతి వ్యవహారం ఈ మర్డర్ మిస్టరీతో ఎలా ముడిపడి ఉంది? అన్నది కథ ముందుకు వెళ్లేకొద్దీ ఆసక్తిని పెంచుతుందందని సినీ ప్రియులు తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.
►ALSO READ | విజయ్‌కు త్రిష సెల్యూట్.. చిరునవ్వు చిందించిన సీఎం.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఇంట్రెస్టింగ్ సీన్
అసలు ట్విస్ట్ ఏంటి?
శవంతో మాయమైన సూట్‌కేసు చుట్టూ మొదలైన మిస్టరీ చివరకు అనేక అనూహ్య మలుపులు తీసుకుంటుంది. ఒక్కో పాత్ర వెనుక దాగి ఉన్న అసలు కథ బయటకు రావడంతో ప్రేక్షకులకు క్యూరియాసిటీ పెరగి కొత్త ప్రశ్నలు ఎదురవుతుంటాయి. చివర్లో వచ్చే ట్విస్టులు కథను మరో స్థాయికి తీసుకెళ్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు.
ఎవరెవరు ఎలా చేశారంటే.
రాజేంద్ర ప్రసాద్ తన సీనియారిటీకి తగ్గట్టుగా మరోసారి తన కామెడీ టైమింగ్ లో ఆకట్టుకున్నారు. కొన్ని సీన్స్ ఆయన ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ థియేటర్లలో నవ్వులు పూయిస్తున్నాయి. ఆయన స్కీన్ మీద కనిపిస్తున్నంత సేపు ప్రేక్షకులు ఫుల్ ఎంటర్టైన అవుతుంటారు. జెమిని సురేష్ , రోల్ రైడా , రాజ్ పనన్ లు తమ పాత్రలకు తగ్గట్టుగా న్యాయం చేశారు. ప్రధానంగా రోల్ రైడా తన ఎనర్జిటిక్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. ఆతను చేసే కామెడీ కూడా ఈ మూవీకి బాగా వర్కౌట్ అయింది. ఇక ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకంఢాప్ మ్యూజిక్ మరింత ఆకట్టుకుంది. సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ ఈ మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచేస్తుంది. అటు ప్రీ క్లైమాక్స్ పోర్షన్ మరింత ఆకట్టుకుంటుంది.
మొత్తానికి 'పాంచాలి పంచ భర్తృక' కామెడీ డ్రామాగా మెప్పించింది. రాజేంద్రప్రసాద్ ఎక్స్ పీరియెన్స్, రోల్ రైడా ఎనర్జిటిక్ , ఫస్ట్ హాప్ లో వచ్చే కామెడీ.. సెకాండాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు చిత్రానికి ప్లస్ గా మారయాన్న అభిప్రాయాన్ని ప్రేక్షేకులు వ్యక్తం చేస్తున్నారు. కామెడీ డ్రామాలను ఇష్టపడేవారు 'పాంచాలి పంచభర్తృక' చూడొచ్చు..
