నిలిచిపోయిన యూపీఐ పేమెంట్స్.. మెట్రో ప్రయాణికుల ఇబ్బందులు

నిలిచిపోయిన యూపీఐ పేమెంట్స్.. మెట్రో ప్రయాణికుల ఇబ్బందులు

 యూపీఐ సేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాలతో యూపీఐ పనిచేయకపోవడంతో.. వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. సాయంత్రం 7.30  తర్వాత యూపీఐ సేవలకు అంతరాయం వాటిల్లిందని కస్టమర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 

ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం సేవలకు అంతరాయం ఏర్పడినట్లు నెటిజన్స్ ఎక్స్ లో పోస్టులు పెడుతున్నారు. 2026 ఆగస్టు 14న సాయంత్రం 7.30 గంటల తర్వాత ఈ సమస్య తలెత్తినట్లు నెటిజన్లు పేర్కొంటున్నారు. 

ముఖ్యంగా యూపీఐ సేవల్లో అంతరాయంతో.. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.  మెట్రో లో డిజిటల్ పేమెంట్స్ ఇష్యూ తలెత్తడంతో ప్రయాణికుల టికెట్ బుకింగ్స్ కు ఇబ్బంది కలిగింది. 

సాయంత్రం ఏడున్నర నుంచి దాదాపు గంట సేపు మెట్రో లో upi పేమెంట్ కి అంతరాయం ఏర్పడినట్లు తెలిపారు. 

గూగుల్ పే, ఫోన్ పే పనిచేయకపోవడంతో  టికెట్ బుకింగ్స్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో క్యాష్ తోనే టికెట్స్ తీసుకున్నారు ప్రయాణికులు. క్యాష్ క్యారీ చేయని వారు ఇబ్బందులకు గురయ్యారు. టెక్నికల్ సమస్య గా మెట్రో సిబ్బంది పేర్కొన్నారు.