ఈ రోజుల్లో ప్రతి చిన్న పనీ ఆధార్ కార్డుతోనే లింకై ఉంది. బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, హోటల్ బుకింగ్ చేసుకోవాలన్నా, చివరికి ఎక్కడైనా ఐడీ ప్రూఫ్ చూపించాలన్నా ఆధార్ కచ్చితంగా ఉండాల్సిందే. అయితే, ఎక్కడికైనా అర్జెంట్‌గా వెళ్లేటప్పుడు ఒరిజినల్ ఆధార్ కార్డు మర్చిపోతే లేదా ఫోన్‌లో ఆధార్ ఫైల్ ఎక్కడ ఉందో వెతుక్కోలేక ఇబ్బంది పడుతుంటే.. టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే, ఇప్పుడు మన ప్రభుత్వం వాట్సాప్ ద్వారానే నేరుగా ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకునే అద్భుతమైన సదుపాయాన్ని కల్పించింది. ఎలాంటి యాప్‌లు ఓపెన్ చేయకుండా, సింపుల్‌గా వాట్సాప్‌లోనే మీ ఆధార్ కార్డును పొందవచ్చు.
ఇందుకు కావాల్సినవి ఏంటంటే?
*మీ ఆధార్ కార్డుకు మీ మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి.
*మీ పేరు మీద 'డిజిలాకర్' (DigiLocker) అకౌంట్ ఉండాలి లేకపోతే యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఇప్పుడే డిజిలాకర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు.
*ప్రభుత్వ అధికారిక 'MyGov Helpdesk' వాట్సాప్ నంబర్ +91-9013151515 ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకోండి.
వాట్సాప్‌లో ఆధార్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం:
*ముందుగా మీ ఫోన్‌లో +91-9013151515 నంబర్‌ను 'MyGov Helpdesk' పేరుతో సేవ్ చేసుకోండి.
*మీ వాట్సాప్ ఓపెన్ చేసి, ఆ కాంటాక్ట్ నంబరుతో చాట్ విండో తెరవండి.
*చాట్‌లో 'Hi' లేదా 'Namaste' అని టైప్ చేసి మెసేజ్ పంపండి.
*అక్కడి నుంచి వచ్చే రిప్లైలలో 'DigiLocker Services' ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి.
*మీకు డిజిలాకర్ అకౌంట్ ఉందా అని బాట్ అడుగుతుంది. 'Yes' అని రిప్లయ్ ఇవ్వండి.. లేకపోతే ముందుగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
*ఇప్పుడు మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
*మీ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఒక OTP (వన్-టైమ్ పాస్‌వర్డ్) వస్తుంది.
*ఆ OTPని వాట్సాప్ చాట్‌లో టైప్ చేసి పంపండి.
*వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, మీ డిజిలాకర్ అకౌంట్లో ఉన్న డాక్యుమెంట్ల లిస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
*అందులో ఆధార్‌కు సంబంధించిన నంబర్‌ను టైప్ చేసి సెలెక్ట్ చేసుకోండి.
*అంతే! మీ ఆధార్ కార్డు PDF ఫార్మాట్‌లో నేరుగా మీ వాట్సాప్ చాట్‌కే వచ్చేస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు.
దీనివల్ల లాభాలు ఏంటి ?
*ఫోన్‌లో ఉండే చాల ఫైళ్లలో వెతుక్కునే సమయం వృథా కాదు.
*ఇది పూర్తిగా సురక్షితమైనది ఇంకా ప్రభుత్వ అధికారిక సర్వీస్.
*ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా అత్యవసర సమయాల్లో క్షణాల్లో పని అయిపోతుంది.
*వేరే వెబ్‌సైట్లు లేదా యాప్స్ తో అవసరమే లేదు.
ఈ సింపుల్ పద్ధతి ద్వారా మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా కేవలం నిమిషాల వ్యవధిలో మీ ఆధార్ కార్డును వాట్సాప్‌లోనే సొంతం పొందవచ్చు.
►ALSO READ | ‘అగ్లీ సిస్టర్ సిటీస్’గా పూణే, గుజరాత్,చెన్నై.. చైనా సరుకు రీరూటింగ్‌పై అమెరికా సీరియెస్
