ఎవరైనా గీత దాటితే వేటు తప్పదు : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

ఎవరైనా గీత దాటితే వేటు తప్పదు : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

ఇటీవల పలువురు కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతున్నాయి. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. కొందరు హద్దులు దాటి మాట్లాడుతున్నారు..  ఇది పార్టీకీ నష్టం కలిగిస్తుంది.. ఎవరి హద్దుల్లో వారుంటే మంచిది. హద్దులు  దాటితే వేటు తప్పదని హెచ్చరించారు మహేస్ గౌడ్. ఇది పార్టీలోని అందరికి వర్తిస్తుందని అన్నారు. 

మునుగోడు ఎమ్మెల్యే,  కాంగ్రెస్ పార్టీ లీడర్  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ పెద్ద దుమారం రేపాయి. కాంగ్రెస్  సీనియర్ నేత  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మహేష్ గౌడ్  మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీ కి నష్టం కలిగించేలా ఉన్నాయన్నారు. ఎంపీ  చామల కిరణ్ కుమార్ ఏం మాట్లాడారో వినలేదు.. ఎవరి హద్దుల్లో వారు ఉంటే మంచిది.. గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. ఇది పార్టీలో అందరికీ వర్తిస్తుందని మహేష్ గౌడ్ అన్నారు.  ఎమ్మెల్యే కోమటిరెడ్డి  రాజగోపాల్  రెడ్డికి పార్టీ ఇచ్చిన హామీపై హైకమాండ్ తో  మాట్లాడాల్సి ఉందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్.

ఇదిలా ఉంటే.. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, రాహుల్‌ గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేస్తూనే.. పార్టీలో బయటి వ్యక్తుల ఆధిపత్యం పెరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేయడంతో చర్చనీయాంశమైంది.