హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్పీ) ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతోన్న అభ్యర్థులకు బిగ్ అప్డేట్. పలు ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల షెడ్యూల విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అక్టోబర్ 24న పీసీబీ అసిస్టెంట్ సైంటిస్ట్ పరీక్ష జరగనుంది. అక్టోబర్ 26న అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
నవంబర్ 6, 7 తేదీల్లో ఆర్ అండ్ బీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) పరీక్షలు జరగనున్నాయి. పాఠశాల విద్యాశాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ / గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్-II పోస్టులకు నవంబర్ 12, 13 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. అన్ని పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు త్వరలోనే విడుదల కానున్నాయి.
