మరి కొన్ని గంటల్లో బ్యాంకుల సమ్మె ప్రారంభం.. అందుబాటులో ఉండే సేవలు ఇవే!

మరి కొన్ని గంటల్లో బ్యాంకుల సమ్మె ప్రారంభం.. అందుబాటులో ఉండే సేవలు ఇవే!

మరి కొన్ని గంటల్లో బ్యాంకుల సమ్మె ప్రారంభం కానుంది. బ్యాంకు ఉద్యోగుల సంఘాలు 2026 సెప్టెంబర్ 28 (సోమవారం) నుంచి 30 వరకు మూడు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో చాలా వరకు బ్యాంకు బ్రాంచీలు మూసివేసే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, కొన్ని ఇతర బ్యాంకింగ్ సంస్థలు ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.  ప్రైవేటు బ్యాంకుల్లో సేవలు వాటి ఏర్పాట్లను ఆధారంగా కొనసాగే అవకాశం ఉంది. బ్యాంకులు బంద్ అయినప్పటికీ కొన్ని సేవలు అందుబాటులో ఉంటాయి. 

సమ్మెతో అన్ని బ్యాంకింగ్ సేవలు ఆగిపోవు. డిజిటల్, సెల్ఫ్ హెల్ప్ సదుపాయాలు సాధారణంగా అందుబాటులో ఉంటాయని అంటున్నారు. 

అందుబాటులో ఉండే సేవలు ఇవే:
  
యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ అందుబాటులో ఉంటాయి. చెల్లింపులు, ఫండ్ ట్రాన్స్ ఫర్ర, బిల్స్ పేమెంట్స్,  ఇతర రోజువారీ లావాదేవీలకు ఇవి ఉపయోగపడతాయి.  
ఏటీఎంలలో క్యాష్ విత్ డ్రా కొనసాగే అవకాశం ఉంది.  అయితే నగదు అందుబాటులో ఉండటం,  రీఫిల్‌పై ఆధారపడి ఉంటుంది.

ప్రభావితం అయ్యే  సేవలు  
బ్రాంచీని సందర్శించాల్సి వస్తే బ్యాంకు మూసి ఉండవచ్చు.  కౌంటర్ దగ్గర నగదు డిపాజిట్, విత్ డ్రా,  చెక్ సంబంధిత పనులు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు, లాకర్ సేవలు మొదలైనవి అందుబాటులో ఉండవు.