విగ్రహాల ఐరన్ కోసం పోటీ..తీసుకెళ్తున్న క్రేన్ ఆపరేటర్లు, వర్కర్లు బయటి కూలీలు

విగ్రహాల ఐరన్ కోసం పోటీ..తీసుకెళ్తున్న క్రేన్ ఆపరేటర్లు, వర్కర్లు బయటి కూలీలు
  •     ఏటా టెండర్లు వేయకుండా గాలికొదిలేస్తున్నరు

హైదరాబాద్ సిటీ, వెలుగు : గణేశ్‌‌ నిమజ్జనం తర్వాత విగ్రహాల్లో ఉపయోగించిన ఐరన్‌‌ గురించి అధికారులు పట్టించుకోకపోవడంతో క్రేన్‌‌ ఆపరేటర్లు, వర్కర్లు, బయటి కూలీలు వచ్చి తీసుకువెళ్లి అమ్ముకుంటున్నారు. దీంతో హుస్సేన్​సాగర్​లో ఐరన్ సేకరణ కోసం పోటీ ఏర్పడింది. ఆదివారం హుస్సేన్‌‌సాగర్‌‌తో పాటు బేబీ పాండ్లు, ఇతర నిమజ్జన కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. విలువైన ఐరన్‌‌ను సేకరించి వేలం లేదా టెండర్‌‌ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. 

3 కార్పొరేషన్ల పరిధిలో 3లక్షలపై గా విగ్రహాలు నిమజ్జనం కాగా, ఇందులో ఐదారు ఫీట్లకి మించిన విగ్రహాలకు ఇనుము వినియోగిస్తారు. పెద్ద విగ్రహాల నిమజ్జనం ఎక్కువగా హుస్సేన్‌‌సాగర్‌‌ లోనే జరుగుతుంది. కానీ, నిమజ్జనం తర్వాత ఇనుము గురించి పట్టించుకోకపోవడంతో ప్రైవేటు వ్యక్తులు ఎంటరవుతున్నారు. కొందరు కూలీలను పెట్టి మరీ తీయించి అమ్ముకుంటున్నారు. ఐరన్‌‌ టెండర్లతో తమకు సంబంధం లేదని, హెచ్‌‌ఎండీఏనే చూసుకోవాలని జీహెచ్ఎంసీ చెప్తోంది.