బీటెక్ అర్హతతో ISROలో ఉద్యోగావకాశం.. 30 ఏళ్లలోపు ఉన్నోళ్లకు ఛాన్స్.. వెంటనే అప్లయ్ చేసుకోండి

 బీటెక్  అర్హతతో ISROలో ఉద్యోగావకాశం.. 30 ఏళ్లలోపు ఉన్నోళ్లకు ఛాన్స్.. వెంటనే అప్లయ్ చేసుకోండి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)కు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్​పీఎస్​సీ)లో సైంటిస్ట్/ ఇంజినీర్ ఎస్​సీ పోస్టుల భర్తీకి  నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.

పోస్టు పేరు: సైంటిస్ట్/ ఇంజినీర్ – ఎస్​సీ. 

విభాగాల వారీగా ఖాళీలు: సైంటిస్ట్/ ఇంజినీర్ - ఎస్​సీ (వెల్డింగ్) 1, సైంటిస్ట్/ ఇంజినీర్ - ఎస్​సీ (టర్బో మెషినరీ) 1, సైంటిస్ట్/ ఇంజినీర్ - ఎస్​సీ పవర్ ఎలక్ట్రానిక్స్ 1. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సటీ నుంచి సంబంధిత విభాగంలో కనీసం 65 శాతం మార్కులతో బీఈ/ బి.టెక్ లేదా ఎంఈ/ఎం.టెక్ పూర్తిచేసి ఉండాలి. 

వయసు: 2026, అక్టోబర్ 13 నాటికి 30 ఏళ్లు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్29.

లాస్ట్ డేట్: అక్టోబర్ 13. 

సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్ ఆధారంగా స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.lpsc.gov.inను సందర్శించండి.