వెంకీ మామ ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చేలా వచ్చింది ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’ (Narayanamma). జస్ట్.. సాంగ్ రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ముగ్గురు ముద్దుగుమ్మలతో విక్టరీ వెంకటేష్ వేసిన స్టైలిష్ స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్‌గా మారాయి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. తనదైన ఎనర్జిటిక్ ట్యూన్‌తో ‘నారాయణమ్మ’ పాటను ఫుల్ జోష్‌లో కంపోజ్ చేయగా.. రామజోగయ్య శాస్త్రి ఫోక్ ఫ్లేవర్‌ను మిక్స్ చేస్తూ క్యాచీగా, వినసొంపుగా లిరిక్స్ అందించారు.
మ్యూజిక్ మొదలైన దగ్గర నుంచి బీట్ పట్టేలా ఉన్న ఈ సాంగ్‌లో మాస్ ఎనర్జీతో పాటు క్యూట్‌నెస్ కూడా బాగా కనిపిస్తోంది. సింగర్స్ రామ్ మిరియాల, హేష నాగుల ప్రభ తమ వాయిస్‌తో పాటకు మరింత ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చారు. ముఖ్యంగా బీట్, వోకల్స్, ఫోక్ టచ్ కలిసిన విధానం సాంగ్‌ను ఈజీగా హమ్ చేసేలా మార్చేసింది.
ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ ఫుల్ జోష్!
ఇక ‘నారాయణమ్మ’ సాంగ్‌లో వెంకటేష్ వేసిన స్టెప్పులు ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్ అనే చెప్పాలి. శ్రీనిధి శెట్టి, డింపుల్ హయతి, నివేదా పేతురాజ్లతో కలిసి వెంకీ మామ వేసిన డ్యాన్స్ మూమెంట్స్ సాంగ్‌కు మరింత గ్లామర్ తీసుకొచ్చాయి. వెంకటేష్ తనదైన స్టైల్, చిలిపి ఎక్స్‌ప్రెషన్స్‌తో స్క్రీన్‌పై కనిపించడంతో పాట మొత్తం చాలా క్యూట్‌గా, కలర్‌ఫుల్‌గా అనిపిస్తోంది. ముగ్గురు హీరోయిన్లతో వెంకీ మామ కెమిస్ట్రీ, డ్యాన్స్ మూమెంట్స్ పాటకు మంచి హైలైట్‌గా నిలిచాయి.
‘నారాయణమ్మ’.. సోషల్ మీడియాలో బిగ్ బాంగ్ పక్కా!
ఫోక్ ఫ్లేవర్‌కు థమన్ ఎనర్జీని యాడ్ చేసి.. వెంకటేష్ స్వాగ్‌ను మిక్స్ చేసిన ‘నారాయణమ్మ’ సాంగ్‌కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్ కూడా కనెక్ట్ అయ్యేలా ఉన్న ఈ పాట వెంకీ మామ ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ లా అనిపిస్తోంది.
►ALSO READ | RANABAALI: ‘రణబాలి’పై మైత్రి మేకర్స్ సంచలన ప్రకటన.. నాలుగు సిరీస్‌లుగా స్పెషల్ డాక్యుమెంటరీ
త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’పై ఈ సాంగ్ మరింత క్యూరియాసిటీ పెంచుతోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ మరో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేలా కనిపిస్తోంది. మొత్తానికి.. ‘నారాయణమ్మ’ బీట్ మొదలైతే వెంకీ మామ స్టెప్పులకు థియేటర్లలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ ఫుల్ జాతర ఖాయమే!
