నెలకు మూడు సార్లు తినండి.. గొంతు నొప్పి ఉండదు.. జలుబు మటు మాయం.. వైరల్ ఇన్ఫెక్షన్ మీ జోలికి రాదు..!

నెలకు మూడు సార్లు తినండి.. గొంతు నొప్పి ఉండదు.. జలుబు మటు మాయం.. వైరల్ ఇన్ఫెక్షన్ మీ జోలికి రాదు..!

వర్షాకాలం కొనసాగుతుంది. ఎల్​నినో ప్రభావంతో వర్షాలు పడకపోయినా.. వైరల్​ ఫీవర్స్​..జలుబు.. గొంతునొప్పి.. ఇలాంటి ఆరోగ్యసమస్యలు వేధిస్తున్నాయి.  కొద్దిగా జ్వరం తగిలినా.. జలుబు చేసినా.. గొంతు నొప్పి ఉన్నా .. ముద్ద దిగదు..రోగనిరోధకశక్తి తగ్గ వ్యాధుల ప్రభావం పెరుగుంది.  

అందుకే  ఈ సీజన్​ లో వారానికి రెండు సార్లు.. పిల్లలే కాదు.. పెద్దలు కూడా వెల్లుల్లి కారంను ఘాటుగా .. వేడి వేడి అన్నంలో కొద్దిగా నూనె వేసుకొని తింటే రుచికి రుచితో పాటు  ఆరోగ్య సమస్యలు ఉండవని వైద్య నిపుణులు చెబుతున్నారు.  ఇలా ఔషధంలా పనిచేసే వెల్లుల్లి కారాన్ని ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .

 వెల్లుల్లి కారంను ఎండుమిర్చితో చేస్తే.. అబ్బో తలచుకుంటేనే నోట్లో లాలాజలం ఊరిపోతుంది.  అసలు సిసలైన కారం ఘాటు నషాళానికి అంటితే చాలు.. గొంతు నొప్పి, జలుబును ఒక్కరోజులో మటుమాయమవుతాయి. 

 వెల్లుల్లి కారం పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు 

 

  • ఎండుమిర్చి- 200 గ్రాములు
  •  వెల్లుల్లి గడ్డలు- : పావుకేజీ
  • జీలకర్ర- ఆరు టీస్పూన్లు 
  • పసుపు-  రెండు టీస్పూన్‌ 
  • నూనె- ఆరు టేబుల్‌ స్పూన్లు
  •  ఆవాలు- రెండు టీస్పూన్‌
  •  కరివేపాకు- ఐదు రెబ్బలు 

వెల్లుల్లి కారం పచ్చడి తయారీ విధానం

వెల్లుల్లి గడ్డను పొట్టు తీసి ఒక బౌల్​ లో పెట్టుకోవాలి.  ఇందులో పది నుంచి 15 రెబ్బల వరకు తీసి వేరే ప్లేట్​ లో పెట్టుకోవాలి.  ఇప్పుడు స్టవ్​ పై మూకుడు పెట్టి  మాడిపోకుండా క్రిస్పీగా ఉండేలా మీడియం ఫ్రేమ్​ పైఎండు మిర్చిని వేయించుకోవాలి.  

ఇప్పుడు రోట్లో జీలకర్ర దంచుకోవాలి.  లేదంటే మిక్సీ పట్టుకోవచ్చు.   అలానే బౌల్​ లోని వెల్లుల్లి రెబ్బలను మెత్తగా పేస్ట్​ చేసుకోవాలి.  ఇప్పుడు జీలకర్ర పొడిని వేసి బాగా కలిసేలా మరోసారి మిక్సీ పట్టుకోవాలి.  ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్​ లోకి తీసుకోవాలి.

ఇప్పుడు వేయించిన మిర్చిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.  లేదా రోట్లో దంచుకోవాలి.  ఇందులో రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీపట్టిన మిరపకాయలను వెల్లుల్లి పేస్ట్​.. జీలకర్ర మిశ్రమం ఉన్న బౌల్​ లో వేసి బాగా కలిసేలా కలపాలి.  ఇందులో చిటికెడు పసుపు వేసి ఇవన్నీ సరిగా కలవకపోతే.. మరోసారి మిక్సీ పట్టుకోండి. 

ఇప్పుడు కళాయిలో నూనెను లో ఫ్రేమ్​ లో వేడి చేయాలి. నూనె వేడెక్కిన తరువాత, అందులో ప్లేట్​ లో ఉంచిన వెల్లుల్లి రెబ్బలు వేయించాలి. ఆవాలు, జీలకర్ర. ఆరు ఎండిమిరచ్చి, కరివేపాకు తో తయారు చేసుకున్న వెల్లుల్లి మిశ్రమంలో తాలింపు పెట్టాలి.  తాలింపు మొత్తం కలిసేలా గరిటెతో కలుపుకోవాలి.  ఇక అంతే అసలైన వెల్లుల్లి కారం పచ్చడి రడీ. 

దీనిని వేడి వేడి అన్నంలో కాని.. చపాతీలు.. జొన్న రొట్టెల్లో తింటే ఆ ఘాటుకి  జలుబు మటు మాయం కావాల్సిందే.. గొంతు ఇన్​ ఫెక్షన్​  తగ్గాల్సిందే.. అంతకాదు.. వెల్లుల్లి కారం బీపీని కంట్రోల్​ చేయడంతో పాటు యాంటీ వైరల్​.. యాంటీ బ్యాక్టీరియాతో పోరాడుతుంది.  ఇంకా  మరి.. ఇంకెందుకు ఆలస్యం ఈ సీజన్​ లో నెలకు మూడు సార్లు ఇలా వెల్లుల్లి పచ్చడి చేసుకొని తిందామా మరి..!