రక్షణ పరిశోధన సంస్థ అయిన డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ (డీఐహెచ్ఏఆర్)లో జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 17.
విభాగాల వారీగా ఖాళీలు: జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్)15, రీసెర్చ్ అసోసియేట్ (ఆర్ఏ) 2.
ఎలిజిబిలిటీ
జూనియర్ రీసెర్చ్ ఫెలో: కంప్యూటర్ సైన్స్, ఐటీ, మెకానికల్, ప్రొడక్షన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇనుస్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ తదితర ఇంజినీరింగ్ విభాగాల్లో మొదటి తరగతిలో బీఈ/ బి.టెక్ ఉత్తీర్ణతతోపాటు వ్యాలిడ్ గేట్ స్కోర్ కలిగి ఉండాలి. లేదా సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో మొదటి తరగతిలో ఎంటెక్ పూర్తిచేసి ఉండాలి.
రీసెర్చ్ అసోసియేట్: కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఎంటెక్ పూర్తిచేసి ఉండాలి. కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు 28 ఏళ్లు, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: అక్టోబర్ 14.
సెలెక్షన్ ప్రాసెస్: అభ్యర్థులు సమర్పించిన ధ్రువపత్రాలు, వివరాల ప్రాథమిక పరిశీలన ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ www.indiascienceandtechnology.gov.inను సందర్శించండి.
