తిలకం పెట్టుకున్న మమ్ముట్టిపై విమర్శలు: ‘బావిలో కప్పల్లా ఆలోచించొద్దు’ అంటూ దుమ్ముదులిపిన నటుడు

తిలకం పెట్టుకున్న మమ్ముట్టిపై విమర్శలు: ‘బావిలో కప్పల్లా ఆలోచించొద్దు’ అంటూ దుమ్ముదులిపిన నటుడు

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నుదుటిపై తిలకం పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జాతీయ చలనచిత్ర అవార్డు అందుకునేందుకు గుజరాత్ వెళ్లిన ఆయనకు అక్కడ సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఓ మహిళ మమ్ముట్టి నుదుటిపై తిలకం దిద్దడంతో.. ఆయన ముస్లిం అయి ఉండి తిలకం ఎలా పెట్టించుకున్నారంటూ కొందరు నెటిజన్లు విమర్శలు చేశారు. ఈ ట్రోలింగ్‌పై మలయాళ నటుడు హరిశ్రీ యూసుఫ్ ఘాటుగా స్పందించారు. విమర్శకులను ‘బావిలో కప్పలు’ అంటూ వ్యాఖ్యానించడంతో పాటు.. మతం మనుషుల మధ్య విభేదాలు సృష్టించడానికి కాదని, మంచి మనుషులుగా మార్చేందుకేనని అన్నారు.

మమ్ముట్టికి తిలకం.. ఎందుకు విమర్శలు?

స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రాంతంలో మమ్ముట్టికి ఘన స్వాగతం లభించింది. బొకే అందించడంతో పాటు నుదుటిపై తిలకం దిద్ది, త్రివర్ణ శాలువాతో ఆయనను సత్కరించారు. మమ్ముట్టి కూడా చిరునవ్వుతో ఆ ఆతిథ్యాన్ని స్వీకరించారు. అయితే, మమ్ముట్టి ముస్లిం కావడంతో ఆయన నుదుటిపై తిలకం పెట్టించుకోవడంపై కొందరు సోషల్ మీడియా యూజర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మతపరమైన గుర్తింపును ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. దీంతో ఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

‘బావిలో కప్పల్లా ఆలోచించొద్దు’: హరిశ్రీ యూసుఫ్

ఈ విమర్శలపై మలయాళ నటుడు, దర్శకుడు హరిశ్రీ యూసుఫ్ స్పందించారు. మమ్ముట్టిని విమర్శించిన ఓ నెటిజన్ వ్యాఖ్యను ప్రస్తావిస్తూ తన సోషల్ మీడియా వీడియోలో ఘాటుగా సమాధానం ఇచ్చారు. మమ్ముట్టి ఒక కళాకారుడని, కళాకారుల ఆలోచనలు విశాలంగా ఉంటాయని హరిశ్రీ యూసుఫ్ అన్నారు. కేవలం మతపరమైన కోణంలోనే ప్రతి విషయాన్ని చూడటం సరైనది కాదని సూచించారు. విమర్శలు చేసిన వారిని ‘బావిలో కప్పలు’ అంటూ ఆయన అభివర్ణించారు.

మతం మనుషులను కలపాలి..

దేవుడిని ఆరాధించే విధానాలు వేర్వేరుగా ఉండొచ్చని హరిశ్రీ యూసుఫ్ పేర్కొన్నారు. నుదుటిపై తిలకం పెట్టుకోవడం, సిలువ గుర్తు చేసుకోవడం, ప్రార్థన కోసం తలవంచడం.. ఇవన్నీ తమ తమ విశ్వాసాలకు సంబంధించిన వ్యక్తీకరణలేనని చెప్పారు. అలాగే ఎవరికైనా అతిథిగా స్వాగతం పలికే సమయంలో అక్కడి సంప్రదాయం ప్రకారం తిలకం దిద్దడం సాధారణమేనని వివరించారు. మమ్ముట్టికి కూడా అదే విధంగా స్వాగతం పలికారని ఆయన పేర్కొన్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yousuf K M (@harisreeyousuf)

మతం పేరుతో సోషల్ మీడియాలో ఇతరులను దూషించడం, వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదని డైరెక్టర్ హరిశ్రీ యూసుఫ్ అన్నారు. మతం ఉద్దేశం.. మనుషుల మధ్య గొడవలు, విభేదాలు సృష్టించడం కాదని.. మనుషులను మరింత మంచి వ్యక్తులుగా మార్చడమేనని వ్యాఖ్యానించారు.

►ALSO READ | RANABAALI: ‘రణబాలి’పై మైత్రి మేకర్స్ సంచలన ప్రకటన.. నాలుగు సిరీస్‌లుగా స్పెషల్ డాక్యుమెంటరీ

మమ్ముట్టి కళాకారుడిగా మాత్రమే కాకుండా సమాజంలో అనేక సేవా కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్న వ్యక్తిగా గుర్తింపు పొందారని ఆయన గుర్తుచేశారు. సమాజానికి ఉపయోగపడే పనులు చేయడంపై దృష్టి పెట్టాలని విమర్శకులకు సూచించారు.

నాలుగోసారి జాతీయ అవార్డు..

ఇక మమ్ముట్టి విషయానికొస్తే.. ‘భ్రమయుగం’ సినిమాలో తన నటనకు గానూ ఆయన జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ఇది ఆయన కెరీర్‌లో నాలుగో జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం. ఈ అవార్డు వేడుక సందర్భంగా గుజరాత్‌లో ఆయనకు లభించిన సంప్రదాయ స్వాగతమే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

మొత్తానికి మమ్ముట్టి తిలకం పెట్టుకున్న ఘటనపై వచ్చిన విమర్శలకు హరిశ్రీ యూసుఫ్ స్పందించడం ఇప్పుడు మలయాళ సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మతం పేరుతో విభేదాలు పెంచడం కంటే, పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా