దక్షిణాఫ్రికాలో వరుస కాల్పులు.. 27 మంది మృతి

దక్షిణాఫ్రికాలో వరుస కాల్పులు.. 27 మంది మృతి
  •     వెడెలా, ల్వాండ్లే టౌన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఘటనలు

జోహన్నెస్‌‌‌‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన సామూహిక కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం రేపాయి. ఈ దుర్ఘటనల్లో మొత్తం 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మొదటి కాల్పుల ఘటన శనివారం రాత్రి వెడెలా టౌన్‌‌‌‌షిప్‌‌‌‌లో జరిగింది. ఎనిమిది మంది సాయుధ దుండగులు ఏకే-47 రైఫిల్స్, పిస్టళ్లతో స్థానికంగా ఉన్న ఒక బార్‌‌‌‌పై విరుచుకుపడ్డారు.

బార్​ లోపలికి ప్రవేశించి విచక్షణారహితంగా తూటాల వర్షం కురిపించారు. ఈ దుర్ఘటనలో 17 మంది స్పాట్‌‌‌‌లోనే మరణించగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మరువకముందే ఆదివారం తెల్లవారుజామున కేప్‌‌‌‌టౌన్ సమీపంలోని ల్వాండ్లే ప్రాంతంలో మరో దుర్ఘటన చోటు చేసుకుంది. ఒక దుకాణంలోకి చొరబడిన దుండగులు జరిపిన కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 11 మంది గాయపడ్డారు.