బాలాపూర్ గణేష్ హుండీ లెక్కింపు పూర్తి.. ఎంత ఆదాయం వచ్చిందంటే..

బాలాపూర్ గణేష్ హుండీ లెక్కింపు పూర్తి.. ఎంత ఆదాయం వచ్చిందంటే..

తెలంగాణ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన బాలాపూర్ గణేష్ హుండీ లెక్కింపు పూర్తయింది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులు సమర్పించిన హుండీ కానుకల లెక్కింపు 2026 సెప్టెంబర్ 27న నిర్వహించారు. మొత్తం రూ. 28,11,999/- (ఇరవై ఎనిమిది లక్షల పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు) ఆదాయం సమకూరినట్లు నిర్వాహకులు తెలిపారు. 

స్వామివారిపై అపారమైన భక్తి విశ్వాసాలతో తమ కానుకలను సమర్పించిన ప్రతి ఒక్క భక్తుడికి ధన్యవాదాలు తెలిపారు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి  నిర్వాహకులు.  

ఇప్పటికే బాలాపూర్ గణేష్ లడ్డూ ప్రసాదం వేలంలో రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే. వేలంలో ఈ సారి 39 లక్షల రూపాయలు పలికింది. గతేడాది 35 లక్షలకు దక్కించుకున్న భక్తులు ఈసారి మరింత వెచ్చించి లడ్డూను సొంతం చేసుకోవడం గమనార్హం.