సెన్‌హైజర్ కొత్త హెడ్‌ఫోన్స్, ఇయర్‌బడ్స్.. 57గంటల బ్యాటరీ లైఫ్

సెన్‌హైజర్ కొత్త హెడ్‌ఫోన్స్, ఇయర్‌బడ్స్.. 57గంటల బ్యాటరీ లైఫ్

జర్మనీకి చెందిన ఆడియో కంపెనీ  సెన్‌‌‌‌హైజర్ భారత్‌‌‌‌లో మొమెంటం 5 వైర్‌‌‌‌లెస్ హెడ్‌‌‌‌ఫోన్లు(ధర రూ.40 వేలు), మొమెంటం ట్రూ వైర్‌‌‌‌లెస్ 5 ఇయర్‌‌‌‌బడ్స్ (ధర రూ.30 వేలు) ప్రీ-ఆర్డర్లను ప్రారంభించింది. వీటిలో హైబ్రిడ్ అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, డాల్బీ అట్మోస్,  రీప్లేసబుల్ బ్యాటరీలు ఉన్నాయి. హెడ్‌‌‌‌ఫోన్లు 57 గంటలు, ఇయర్‌‌‌‌బడ్స్ అయితే కేస్‌‌‌‌తో కలిపి 40 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తాయి. ప్రీ-ఆర్డర్లపై రూ.5,990 విలువైన బ్లూటూత్‌‌‌‌ డాంగిల్, అదనపు వారంటీ లభిస్తాయి. అక్టోబర్ 1 నుంచి సేల్స్‌‌‌‌ మొదలవుతాయి.