కీర్తి సురేష్ డోరతీ.. అక్టోబర్ 2న తెలుగు రిలీజ్

కీర్తి సురేష్ డోరతీ.. అక్టోబర్ 2న తెలుగు రిలీజ్

కీర్తి సురేష్ లీడ్ రోల్‌‌లో కార్తీక్ సుబ్బరాజ్ రూపొందిన తమిళ చిత్రం  ‘డోరతీ’. ఇప్పటికే తమిళంలో విడుదలైన  ఈ సినిమాను..  రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అక్టోబర్ 2న తెలుగు వెర్షన్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. 1990ల నాటి గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో స్నేహం, ప్రేమ, సామాజిక అంశాలు కీలకంగా ఉండనున్నాయి.  

సనాంత్, రిషికాంత్ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి  ఇళయరాజా సంగీతం అందించారు.  కీర్తి సురేష్‌‌ డిఫరెంట్ రోల్ పోషించిన ఈ చిత్రం తెలుగు ఆడియన్స్‌‌ను ఎలా మెప్పిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కీర్తి సురేష్​ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. వాటిలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్​, కళ్యాణ్ రామ్ హీరోలుగా తెరకెక్కుతోన్న  ‘జనవరి 12 విడుదల’ చిత్రంలో ఆమె వెంకీ జోడీగా కనిపించనుంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం  ప్రేక్షకుల ముందుకొస్తోంది.