రష్మిక క్రేజ్‌కే సవాల్ విసురుతున్న కొత్త అందాల భామ.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న 'న్యూ నేషనల్ క్రష్' ఎవరంటే?

రష్మిక క్రేజ్‌కే సవాల్ విసురుతున్న కొత్త అందాల భామ.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న 'న్యూ నేషనల్ క్రష్' ఎవరంటే?

సినీ ఇండస్ట్రీలో 'నేషనల్ క్రష్' అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు రష్మిక మందన్న. ఈ ట్యాక్ ఈ బ్యూటీకి ఒక పర్యాయపదంగా మారిపోయింది. 'కిరాక్ పార్టీ'. 'గీతా గోవిదం', 'పుష్ప' వంటి టాలీవుడ్ బ్లాక్ బస్టర్  సిరీస్ వరకు .. తన గ్లామర్, క్యూట్ నెస్ తో దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది.  టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. 

రష్మిక క్రేజ్ కే సవాల్..

అయితే ఇప్పుడు రష్మిక క్రేజ్ కే సవాల్ విసురుతూ.. నెట్టింట ఒక కొత్త అందాల భామ సంచలనం సృష్టిస్తోంది.  ఆమెరే తన్యా మిశ్రా (Tanya Mishra).  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తన్యా మిశ్రా ఫొటోలు, వీడియోలే వైరల్ అవుతున్నాయి. ఆమె గ్లామరస్ లుక్స్, హాట్ ఫొటోషూట్లకు కుర్రకారు ఫిదా అయిపోతుండటంతో అభిమానులు ఆమెను 'ఇండియాస్ న్యూ నేషనల్ క్రష్' అంటూ అభివర్ణిస్తున్నారు.

బీహార్ నుంచి గ్లామర్ వరల్డ్‌కి..

బీహార్‌లోని గయాలో జనవరి 31, 1999న తన్యా జన్మించింది. మగధ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (B.Com) డిగ్రీ పూర్తి చేసి మోడలింగ్‌పై ఉన్న మక్కువతో ముంబైకి పయణమైంది. 'IAWA మిస్ ఇండియా 2019' పోటీల్లో ఫోర్త్ రన్నరప్‌గా నిలిచి మెరిసిన ఈ భామ.. ఫెమినా, ఫిల్మ్‌ఫేర్, గ్రాజియా వంటి ప్రతిష్టాత్మక ఫ్యాషన్ మ్యాగజైన్లలో తన అంద చందాలతో అదరగొట్టింది.

సిబిఐ ఇన్స్పెక్టర్ పాత్ర నుంచి..

కేవలం మోడలింగ్‌కే పరిమితం కాకుండా ఈ ముద్దుగుమ్మ.. నటిగానూ తనదైన ముద్ర వేసింది. 'ఘజ్నవి' చిత్రంతో సినీ ప్రయాణం ప్రారంభించిన తన్యా..'చేజ్' అనే థ్రిల్లర్ సినిమాలో ఏకంగా సిబిఐ ఇన్స్పెక్టర్ పాత్రలో నటించి మెప్పించింది. హర్మాన్ బావేజా ప్రొడక్షన్స్‌లో జాకీ ష్రాఫ్, భూమిక చౌలా, సికందర్ ఖేర్‌లతో కలిసి 'చిడియా ఉడ్' అనే బిగ్ వెబ్ సిరీస్‌లోనూ కీలక పాత్ర పోషించింది.

అంతేకాకుండా 'నఖ్రో', 'తూ మేరా హో జాయేగా' సహా ఏడుకి పైగా సూపర్ హిట్ మ్యూజిక్ వీడియోలలో లీడ్ యాక్ట్రెస్‌గా అలరించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2 మిలియన్ల  ఫాలోవర్లతో రోజురోజుకీ క్రేజ్ పెంచుకుంటుంది. త్వరలోనే 'సఫర్ మొహబ్బత్ కా' అనే రోమాంటిక్ సాంగ్‌తో రాబోతోంది. మోడలింగ్ నుంచి నటన వరకు ఆకట్టుకుంటున్న ఈ 'న్యూ నేషనల్ క్రష్'త్వరలోనే టాలీవుడ్, బాలీవుడ్ బిగ్ ప్రాజెక్టుల్లో ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు ఫ్యాన్స్.